US Visa: రికార్డు స్థాయిలో భారత్ – అమెరికా వీసాలు.. కీలక విషయాలు వెల్లడించిన యూఎస్ ఎంబసీ..

|

Jan 29, 2024 | 8:00 PM

గతంలో భారతీయుల వీసాపై అమెరికా నిషేధం విధించింది. అయితే తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం 2023లో రికార్డు స్థాయిలో వీసాలను ప్రాసెస్ చేసినట్లు వెల్లడైంది. అలాగే సందర్శకుల వీసా అపాయింట్‌మెంట్ వెయిటింగ్ సమయాన్ని 75 శాతానికి తగ్గించినట్లు తెలిసింది. భారతదేశంలోని యుఎస్ కాన్సులర్ టీం 2023 సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ యుఎస్ వీసాలను ప్రాసెస్ చేసినట్లు వెల్లడించింది.

US Visa: రికార్డు స్థాయిలో భారత్ - అమెరికా వీసాలు.. కీలక విషయాలు వెల్లడించిన యూఎస్ ఎంబసీ..
Us Visa
Follow us on

గతంలో భారతీయుల వీసాపై అమెరికా నిషేధం విధించింది. అయితే తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం 2023లో రికార్డు స్థాయిలో వీసాలను ప్రాసెస్ చేసినట్లు వెల్లడైంది. అలాగే సందర్శకుల వీసా అపాయింట్‌మెంట్ వెయిటింగ్ సమయాన్ని 75 శాతానికి తగ్గించినట్లు తెలిసింది. భారతదేశంలోని యుఎస్ కాన్సులర్ టీం 2023 సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ యుఎస్ వీసాలను ప్రాసెస్ చేసినట్లు వెల్లడించింది. 2022తో పోల్చితే 60 శాతం దరఖాస్తులు పెరిగాయని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్‌లు జనవరి 29, సోమవారం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 యూఎస్ వీసా దరఖాస్తుదారులలో ఒకరికి భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తున్నాయని చెప్పింది. సందర్శకుల వీసాలు (B1/B2) యూఎస్ మిషన్ చరిత్రలో రెండవ అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలలో స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపింది.

ఉపాధి వీసాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు వివరించింది యూఎస్ ఎంబసీ సంస్థ. 2024లో, ఒక పైలట్ ప్రోగ్రామ్ యునైటెడ్ స్టేట్స్‌లో తమ వీసాలను పునరుద్ధరించుకోవడానికి అర్హులైన H-1B హోల్డర్‌లను అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడం ద్వారా ఇండియా సామర్థ్యాన్ని పెంచడానికి దోహదపడినట్లు తెలిపారు సంస్థ ప్రతినిధులు. అలాగే చెన్నై , హైదరాబాద్‌లలోని వీసా కేంద్రాల్లో అధికశాతం దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. 2023 సంవత్సరానికిగాను ఇండియన్స్ తమ కుటుంబ సభ్యుల కోసం 3,80,000 ఉద్యోగ వీసాలు ప్రాసెసింగ్‌ చేసినట్లు గణాంకాలను వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆలస్యమైన 31,000 వలసదారుల వీసాలను ముంబై కాన్సులేట్ జనరల్ తొలగించిందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..