ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో ప్రశంసల వర్షం కురిపించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని.. ఇలాంటి నాయకుడిని తాను ఇంతవరకు చూడలేదన్నారు. గత నెల (మార్చి 7, మార్చి 10 మధ్య) భారతదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం (ఏప్రిల్ 15) అమెరికాలోని ఇండియా హౌస్‌లో జరిగిన రిసెప్షన్‌లో గినా రైమోండో మాట్లాడుతూ, తాను ప్రధాని మోదీతో 1 గంటకు పైగా సమావేశం అయినట్లుగా తెలిపారు. ఈ సమయం చాలా అద్భుతమైనదని గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీకి చాలా భిన్నమైన ప్రత్యేకత ఉందని.. అది ఆయనను ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలబెట్టిందని గినా రైమోండో చెప్పుకొచ్చారు.
ప్రధాని మోదీ చాలా దూరంగా ఆలోచిస్తున్నారని గినా రైమోండో అన్నారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజల పట్ల అతని నిబద్ధత స్థాయి చాలా గొప్పగా ఉందన్నారు. ఇది వర్ణించడం కూడా చలా కష్టం. భారతదేశ ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడంలో.. భారత దేశాన్ని ప్రపంచ శక్తిగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని మోదీ సంకల్ప శక్తి నిజమైనదని అన్నారు. ఇదే కోణంలో ప్రధాని మోదీ పనితీరు ఉందని.. నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రధాని మోదీ గురించి అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో మాట్లాడుతూ తనకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని అన్నారు. ప్రధాని మోదీ టెక్నాలజీ గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడతారని తెలిసిన వారికి తెలుసు.. అతను టెక్నాలజీకి సంబంధించిన ప్రతి అంశంపై చాలా శ్రద్ధ చూపుతారు.
రేడియో యాక్సెస్, కృత్రిమ మేధస్సు గురించి తాను ప్రధాని మోదీతో మాట్లాడినట్లుగా తెలిపారు. రానున్న కాలంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్, అమెరికాలు శాసించనున్నాయని అన్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదని.. AI అంటే.. అమెరికా- ఇండియా సాంకేతిక పర్యావరణ వ్యవస్థ అని ప్రధాని తనతో చెప్పారని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో తెలిపారు.
#WATCH | US: I had an incredible opportunity to spend more than an hour with PM Modi. He is the most popular world leader for a reason; he is visionary; and his level of commitment to the people of India is indescribable. His desire to lift people out of poverty & move India… pic.twitter.com/650oyJqfTg
— ANI (@ANI) April 16, 2023
భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని కలవడమే కాకుండా పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు పలువురు మంత్రులను కూడా కలిశారు US వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో. అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో, పీయూష్ గోయల్ సంయుక్తంగా ఇండియా-యుఎస్ వాణిజ్యం అనే అంశంపై మీడియా సమావేశంలో ప్రసంగించారు.