CDC Study: వ్యాక్సిన్ తీసుకోకపోతే.. కరోనా రెండోసారి కూడా సోకుతుంది.. సీడీసీ హెచ్చరిక

|

Aug 08, 2021 | 1:56 PM

Covid-19 Vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకడుగు

CDC Study: వ్యాక్సిన్ తీసుకోకపోతే.. కరోనా రెండోసారి కూడా సోకుతుంది.. సీడీసీ హెచ్చరిక
Covid 19 Vaccine
Follow us on

Covid-19 Vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే మృత్యువు ముప్పు నుంచి తప్పించుకోవచ్చని.. కోవిడ్ ప్రభావం కూడా తగ్గుతుందని పలు అధ్యయనాలు సూచించాయి. ఈ క్రమంలో అమెరికాలోని ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ (సీడీసీ) మరో కీలక అధ్యయనాన్ని వెల్లడించింది. దీనిద్వారా కోవిడ్‌-19 టీకా పొందని వారికి.. తీసుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తూ స్టడీ రిపోర్టును విడుదల చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారితో పోలిస్తే.. తీసుకోని వారికి రెండోసారి కరోనా సోకే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని సీడీసీ వెల్లడించింది. అయితే.. సీడీసీ అధ్యయనంలో భాగంగా కోవిడ్ సోకిన వందలాది మందిని పరిశీలించింది.

గతేడాది చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతోపాటు ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డారు. అయితే.. టీకా పొందని వారికి రీ ఇన్‌ఫెక్షన్‌ ముప్పు 2.34 రెట్లు అధికంగా ఉందని సీడీసీ పేర్కొంది. కావున గతంలో కొవిడ్‌ బారిన పడిన వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సీడీసీ డైరెక్టర్‌ రోషెల్‌ వాలెన్‌స్కీ స్పష్టంచేశారు. కరోనాలోని డెల్టా రకం తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తప్పనిసరిగా అవసరమంటూ పేర్కొన్నారు.

అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్లలో డెల్టా 83 శాతం మేర వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు. కరోనా ముప్పు ఎక్కువగా ఉండే వృద్ధులు ఆసుపత్రిపాలు కాకుండా చూడటంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేశాయని పేర్కొంటున్నారు. కావున ప్రతిఒక్కరూ తొందరగా కోవిడ్ వ్యాక్సిన్‌లను తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:

Snake ATTACKS Cat: పిల్లిపై పాము దాడి చేసింది.. ఆ సమయంలో ఎలా తప్పించుకుందో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు…

Train: రైలు ప్రయాణం అంటే మీకు ఇష్టమా.. మన దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏమిటో తెలుసా..?