Corona Effect: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా కట్టడికి చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం అదుపులో ఉంది. లాక్‌డౌన్, కరోనా ఆంక్షలు, వ్యాక్సినేషన్ వల్ల ప్రస్తుతం కోవిడ్ (Covid-19) తగ్గుముఖం పట్టింది. థర్డ్‌వేవ్‌లో పెద్దగా పాజిటివ్ కేసులేమి నమోదు కాలేదు. అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత చాలా మందిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కసారి కరోనా (Corona) వచ్చిందంటే శరీరంలోని అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. కరోనా వచ్చిన వారిలో అనేక అనారోగ్యకరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్య నిపుణులు ఇప్పటికే తెలియజేశారు. ఇక కరోనా వైరస్ గుండె (Heart)లోని సూక్ష్మ రక్తనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ (University of Bristol) పరిశోధకుల బృందం అధ్యయనం ద్వారా తేల్చింది.
తమ పరిశోధనలో భాగంగా గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను కప్పి ఉంచే పెరిసైట్స్‌పైకి కరోనా వేరియంట్లన్నింటినీ ప్రయోగించారు పరిశోధకులు. ఇవన్ని కూడా పెరిసైట్స్‌ను ఇన్ఫెక్ట్ చేయలేకపోయాయి. అయితే కేవలం స్పైక్ ప్రొటీన్లను ప్రయోగించినప్పుడు మాత్రం ఆ ప్రొటీన్లు ఎండో థీలియల్ కణాలతో సంభాషించకుండా పెరిసైట్లను నియత్రించడమే కాక వాపును కలిగించే సైటోకైన్లను ప్రసవించేలా చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే కోవిడ్ సోకిన పేషెంట్లలో ఉండే స్పైక్ ప్రొటీన్లు, మొత్తం రక్తప్రసరణ వ్యవస్థ అంతా ప్రయాణిస్తూ అన్ని అవయవాలనూ దెబ్బతీసే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాన్ని ‘క్లినికల్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురించారు.
ఇవి కూడా చదవండి: