తాలిబన్ల వశంలో ఉన్న కాబూల్ లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. విమానాశ్రయంలో వేలమంది మొదట ఈ నగరం నుంచి బయటపడితే చాలుననుకుంటున్నారు. కాగా అక్కడి గురుద్వారా నుంచి 25 మంది భారతీయులతో సహా మొత్తం 78 మంది ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. తమతో బాటు పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథాలను కూడా అక్కడి నుంచి తీసుకువచ్చారు. వీటిలో మూడింటిని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి అందుకుని ఢిల్లీలోని గురుద్వారాకు చేర్చారు. పరాయి దేశంలోని గురుద్వారాలో ఉన్న వీటిని అందుకోవడం తన పూర్వజన్మ సుకృతమని.ఆయన ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ కాపీలనన్నిటినీ శానిటైజ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇండియా చేరినవారిలో 44 మంది ఆఫ్ఘన్ సిక్కులు కూడా ఉన్నారు. కాగా విమానాశ్రయంలో పురి వెంట ఉన్న ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ .. సిర్సా సీఏఎ (పౌరసత్వ సవరణ చట్ట) కటాఫ్ తేదీ..సంవత్సరాన్ని 2014 నుంచి 2021 కి మార్చాలని ప్రధాని మోదీని కోరారు. దీనివల్ల ఆప్ఘన్ నుంచి వచ్చే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
దేశంలో ఇప్పటికే మెల్లగా ఈ డిమాండ్ ఊపందుకుంటోంది. ఆఫ్ఘన్ శరణార్థులు వెల్లువలా వస్తుండడంతో.. అనేకమంది సీఏఎ సంవత్సరాన్ని మార్చాలని కోరుతున్నారు. తమకు ఇప్పుడు ఓ దేశమంటూ లేదని, తాము ఎక్కడివారమని ఇండియా చేరిన ఆఫ్ఘన్ వాసులు ప్రశిస్తున్నారు. ఢిల్లీలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు కొన్ని వందలమంది ఆఫ్గాన్ వాసులు ఈ ప్రస్తావన తెస్తున్నారు. సీఏఎ ని సవరించిన పక్షంలోనైనా తమకు కొంత ప్రయోజనం కలుగుతుందని వీరు భావిస్తున్నారు.
ਵਾਹੁ ਵਾਹੁ ਬਾਣੀ ਨਿਰੰਕਾਰ ਹੈ
ਤਿਸੁ ਜੇਵਡੁ ਅਵਰੁ ਨ ਕੋਇ ।।Deeply privileged & fortunate to welcome the three holy Swaroop of Sri Guru Granth Sahib Ji from Kabul at @DelhiAirport along with Sh @VMBJP Ji, Sh @dushyanttgautam Ji & members of Sikh Sangat. pic.twitter.com/mWhTwpnoOs
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 24, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు నెక్ట్స్ వన్ ఇయర్ సూపరో సూపర్.. కారణం ఏంటంటే?
CM KCR: టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ.. మెయిన్ ఎజెండా ఇదే.. లైవ్ వీడియో