నరుల సంచారం లేని ఎడారిలో ప్రత్యక్షమైన లోహపు స్తంభం

మనుషులు వెళ్లలేని ప్రాంతంలో ఓ లోహపు దిమ్మె కనిపించిందనుకోండి.. ముందు ఆశ్చర్యపోతాం.. ఆనక రకరకాల సందేహాలతో బుర్ర పాడుచేసుకుంటాం..

నరుల సంచారం లేని ఎడారిలో ప్రత్యక్షమైన లోహపు స్తంభం
Follow us

|

Updated on: Nov 25, 2020 | 10:14 AM

The Strangest Thing ః మనుషులు వెళ్లలేని ప్రాంతంలో ఓ లోహపు దిమ్మె కనిపించిందనుకోండి.. ముందు ఆశ్చర్యపోతాం.. ఆనక రకరకాల సందేహాలతో బుర్ర పాడుచేసుకుంటాం.. ఇప్పుడు అమెరికాలోని ఉటా ఎడారిలో ప్రత్యక్షమైన ఓ లోహపు దిమ్మె ఇలాంటి అనుమానాలనే రేకెత్తిస్తున్నాయి.. సుమారు 12 అడుగుల పొడవున్న ఈ దిమ్మెను ఎవరు…ఎందుకు.. ఎలా పెట్టారనే డౌట్స్‌ వస్తున్నాయి.. అసలీ దిమ్మెను ఎవరు కనిపెట్టారంటే ఉటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీవాళ్లు.. వాళ్లకు కూడా కాకతాళీయంగానే ఇది కనిపించింది.. అడవి గొర్రెల సంతతిని లెక్కపెట్టడానికి హెలికాఫ్టర్‌లో వెళ్లినప్పుడు వారికి ఈ లోహపు దిమ్మె కనిపించింది.. ఉటా నైరుతి దిక్కున ఎర్రరాళ్ల మధ్య ఇది ఉంది.. ఆ లోహపు స్తంభం అక్కడికి ఎలా వచ్చిందో, తెచ్చిన వారు ఎలా తెచ్చారో అధికారులకు కూడా తెలియదు.. పోనీ ఎవరైనా పాతిన ఆనవాళ్లు ఉన్నాయా అంటే అవి కూడా లేవు. ఈ లోహపు స్తంభం 1968లో విడుదలైన 2001ః ఎ స్పేస్‌ ఒడెస్సీ సినిమాలో మాదిరిగానే ఉందని అంటున్నారు.. అందుకే అందరికీ ఇంత ఆసక్తి.. ఆ సినిమాలో గ్రహాంతరవాసుల నిర్మాణం అచ్చంగా ఇలాగే ఉంటుంది.. అయితే అధికారులు మాత్రం ఈ దిమ్మె అనుపానాలు చెప్పడం లేదు.. ఎందుకంటే చెబితే దాన్ని చూసేందుకు పోలోమని జనాలు వెళతారు.. అది మనుషులు వెళ్లలేని ప్రాంతం.. వెళితే అక్కడ చిక్కుకుపోవడం ఖాయం.. అందుకే అధికారులు సిక్రేట్‌ పాటిస్తున్నారు. ఇంకొందరు అధికారులేమో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఇలాంటి నిర్మాణాలు చేపడతారా? ఎర్త్‌ లాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడుతున్నారు.. ఇదంతా కాదు కానీ ముందు ఎవరు కట్టారో తేల్చండయ్యా బాబులూ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.. మరి ఈ మిస్టరీ ఎప్పటికీ వీడుతుందో చూడాలి!