వారెన్ బఫెట్ ఓడిపోయాడు…బిల్‌గేట్స్ బ్యాక్ అయ్యాడు…కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తున్నాడు..
మస్క్ మ్యాటర్ ఇది. వారెన్ బఫెట్ ఓడిపోయాడు. బిల్‌గేట్స్ బ్యాక్ అయ్యాడు. ప్రపంచానికి కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తున్నాడు. హీ ఇజ్ నన్ అదర్ ద్యాన్.. ఎలన్ మస్క్. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరాడు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్...
Elon Musk overtake : మస్క్ మ్యాటర్ ఇది. వారెన్ బఫెట్ ఓడిపోయాడు. బిల్‌గేట్స్ బ్యాక్ అయ్యాడు. ప్రపంచానికి కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తున్నాడు. హీ ఇజ్ నన్ అదర్ ద్యాన్.. ఎలన్ మస్క్. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరాడు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను వెనక్కినెట్టేశాడు.
ప్రస్తుతం మస్క్ నికర సంపద విలువ 127.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. బిల్ గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లు. టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు, అంతరిక్ష యానం, సరికొత్త బ్యాటరీ కార్లు, హైపర్ లూప్ ప్రయాణం వంటి వ్యాపారాలతో లాభాల బాటలో దూసుకుపోతున్నాడు మస్క్.
ఇటీవల మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల మార్కెట్ విలువ భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలో మస్క్ కు చెందిన సంస్థల షేర్ల విలువ మరింత మెరుగైంది. ఈ ఒక్క ఏడాదికే మస్క్ ఆస్తి 100 బిలియన్ డాలర్లు పెరిగిందంటే టెస్లా, స్పేస్ ఎక్స్ ల ప్రస్థానం ఎంత ఉజ్వలంగా ఉందో అర్థమవుతుంది. ఇక ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు.
ఆయన సంపద విలువ ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లు. త్వరలోనే మస్క్.. అమెజాన్ అధినేతను దాటేస్తాడని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మస్క్ స్పేస్ ఎక్స్‌లో కొత్త ఆవిష్కరణలు చేపడితే.. అతడి సంపద ఇంకా పెరుగుతుంది.
మరోవైపు టెస్లాతో డ్రైవర్‌లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించాడు. త్వరలోనే మనుషులను మార్స్ మీదకు పంపుతానని చెబుతున్న మస్క్.. అన్నంతపని చేస్తే మాత్రం అతడి సంపద ఆకాశాన్ని అంటడం ఖాయం.