రేపిస్టులను నపుంసకులుగా మార్చేందుకు వీలు కల్పించే చట్టం!
Rapists will be made impotent : పాకిస్తాన్‌లో అత్యాచారాలను, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడానికి ఆ దేశ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురాబోతున్నది..
Rapists will be made impotent : పాకిస్తాన్‌లో అత్యాచారాలను, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడానికి ఆ దేశ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురాబోతున్నది.. రేపిస్టులకు కెమికల్స్ సాయంతో నపుంసకులుగా మార్చేందుకు వీలు కల్పించే చట్టం రాబోతున్నది.. ఈ కొత్త చట్టానికి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు కూడా! అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ పేరుతో లా మినిస్ట్రీ ఈ ముసాయిదాను ఫెడరల్ కేబినెట్ మీట్‌లో ప్రవేశపెట్టింది.. అయితే ఈ ముసాయిదా విషయంపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడకపోయినా మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి కఠినచట్టం త్వరలో రాబోతున్నదని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఏళ్ల తరబడి విచారణలు ఉండవని, అలాగే సాక్షులకు కూడా తగు రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు..