దాయాది దేశం పాక్‌లో ఉన్న ఓ శివాలయం గురించి మీకు చెప్పాలి. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శంభో శంకర.. హర హర మహాదేవ అంటూ ఆ ప్రాంతమంతా శివ నామస్మరణలో మార్మోగిపోతుంది. సింధ్(Sindh) రాష్ట్రం ఉమర్‌కోట్(Umarkot)లో ఈ శివాలయం ఉంది. ఉమర్‌కోట్ సిటీలో దాదాపు 80 శాతం మంది హిందువులు ఉన్నారు. దేశం విభజన సమయంలో వివిధ కారణాల వల్ల వీరంతా అక్కడే ఉండటానికి మొగ్గుచూపారు. అందుకే ఈ ఆలయం నిత్యం భక్తులతో అలరారుతూ ఉంటుంది. కాగా ఇక్కడి శివలింగానికి ఓ స్పెషాలిటీ ఉంది. అది నానాటికి పెరుగతూ వస్తుంది. తొలుత శివలింగం ఎలా ఉండేదో ఆ పరిమాణాన్ని ఓ గీత మాదిరిగా గీశారు. ఇప్పుడు ఆ గీతను దాటి శివలింగం పెరగడాన్ని మీరు ఫోటోలో చూడవచ్చు. పండితులు.. భక్తులు చెబుతున్న వివరాల ప్రకారం.. కొందరు కాపర్లు.. తమ పశువులను మేపేందుకు ఇప్పుడు శివలింగం ఉన్న ప్రాంతానికి వచ్చేశారు. అప్పుడు అక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. ఈ క్రమంలో మందలోని కొన్ని ఆవులు.. ఓ ప్రాంతానికి వెళ్లి వాటంతట అవే పాలివ్వడాన్ని గమనించారు. అక్కడికి వెళ్లి చూడగా శివలింగం దర్శనమిచ్చింది. అప్పటి నుంచి అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఇక్కడ విపరీతంగా ఉంటుంది. ఆలయాన్ని కూడా చాలా చక్కగా వృద్ధి చేశారు. ఎటవంటి మత వైష్యమాలు తమ మధ్య ఉండవని అక్కడి హిందువులు, ముస్లింలు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి