Lady Anchor: లైవ్‌లో న్యూస్ చదువుతూ తడబడిన యాంకర్.. అయ్యో ఏంటి ఇలా జరిగింది..(వీడియో)
లైవ్ న్యూస్ చదువుతున్నప్పుడు యాంకర్ ఎంత అప్రమత్తంగా ఉంటారో తెలిసిందే. అయితే ఎప్పుడూ గలగలా మాట్లాడే ఆ యాంకర్ తడబడింది. వార్తలు చదువుతున్న సమయంలో నోట మాటలు
లైవ్ న్యూస్ చదువుతున్నప్పుడు యాంకర్ ఎంత అప్రమత్తంగా ఉంటారో తెలిసిందే. అయితే ఎప్పుడూ గలగలా మాట్లాడే ఆ యాంకర్ తడబడింది. వార్తలు చదువుతున్న సమయంలో నోట మాటలు రావడం కష్టంగా మారింది. దాంతో తనకు ఏదో జరుగుతోందని అర్థం చేసుకున్న ఆమె.. వెంటనే వాతావరణ వివరాలు తెలుసుకుందాం అంటూ తను పక్కకు తప్పుకుంది. ఇదంతా గమనిస్తున్న సహోద్యోగులు వెంటనే అప్రమత్తమయ్యారు. అంబులెన్సులు పిలిపించి ఆమెను ఆస్పత్రికి తరలించారు.యాంకర్‌ను పరీక్షించిన వైద్యులు ఆమెకు స్ట్రోక్ వచ్చిందని నిర్ధారించారు. స్ట్రోక్ ప్రారంభ దశలోనే ఆస్పత్రికి రావడంతో ఆమె వెంటనే కోలుకుందని వైద్యులు చెప్పారు. ఈ ఘటన అమెరికాలోని టుస్లా ఎన్బీసీ స్టేషన్‌లో జరిగింది. చంద్రుడి మీదకు అమెరికా పంపాల్సిన ఆర్టెమిస్ ప్రయోగం మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వార్త చదువుతున్న సమయంలోనే యాంకర్ జూలీ చిన్‌లో స్ట్రోక్ లక్షణాలు కనిపించాయి. అదే ఛానెల్‌లో పనిచేసే మైక్ సింగ్‌టాన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. జూలీ ప్రస్తుతం బాగానే ఉందని, అయితే స్ట్రోక్ వార్నింగ్ సైన్స్ గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆమె కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో తను కోలుకున్నట్లు పోస్టు పెట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

