Telugu News World Ukrainian russia war: Ukrainian Grandmother Picks up AK 47, Undergoes Combat Training Amid Russia Tension
Ukrainian Grandmother: దేశం కోసం నేను సైతం.. తుపాకీ పట్టిన 70 ఏళ్ల ఉక్రెయిన్ బామ్మ..
Ukrainian Grandmother: పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్పʹ అని కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఉక్రెయిన్ (Ukrainian) దేశస్థులు ఇప్పుడు అమలు చేస్తున్నారు. రష్యా(Russia)తో జరుగుతున్నా పోరులో..
Ukrainian Grandmother: పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్పʹ అని కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఉక్రెయిన్ (Ukrainian) దేశస్థులు ఇప్పుడు అమలు చేస్తున్నారు. రష్యా(Russia)తో జరుగుతున్నా పోరులో ఉక్రెయిన్ దేశస్థులు మేము సైతం అంటూ.. ఆయుధాలు పట్టి కథన రంగంలోకి దిగుతున్నారు.. విజయమో.. వీరస్వర్గమో అన్న చందంగా రష్యా సేనలతో పోరాడుతున్నారు. అవును రష్యా సైన్యంపై ఉక్రెయిన్ పౌరుల దాడులు చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపు మేరకు పౌరుల.. వయసుతో నిమిత్తం లేకుండా కదనరంగానికి ఉరుకుతున్నారు. సైనిక దుస్తులు ధరించి సైన్యానికి, ప్రజలకు అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రేరణనిస్తున్నారు. సామర్థ్యమున్నవారు ఆయుధాలు పట్టి దేశంకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు దాటిన యువతీ యువకులు ఎవరైనాసరే స్వచ్ఛంధంగా యుద్ధంలో పాల్గొనవచ్చని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోలోటొవ్ కాక్ టెయిల్ అటాక్స్, ఏకే 47 పట్టిన మహిళలు కదన రంగంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. మరికొందరు పెట్రోల్ బాంబులతో రష్యా ట్యాంకులపై దాడులు చేస్తుండగా.. వేలకొద్దీ పౌరులు ఆయుధాలు చేతబట్టి రష్యన్ దళాలను ఎదురిస్తున్నారని అధికారులు తెలిపారు. అయితే 18-60 ఏళ్ల పురుషులు ఉక్రెయిన్ వీడటంపై ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించింది.
మోలోటెవ్ కాక్ టెయిల్ అటాక్స్ అంటే..పెట్రోల్, ఆల్కాహాల్, గాజు సీసాల్లో నింపి దానికి మంట అంటించి దాడులకు పాల్పడడాన్ని మోలోటొవ్ కాక్ టెయిల్ అటాక్స్ అని అంటారు. ప్రస్తుతం ఈ విధంగా రష్యా సైన్యంపై ఉక్రెయిన్ పౌరులు దాడులకు పాల్పడుతున్నారు. రష్యా యుద్ధ ట్యాంకులు రాజధాని నుంచి ముందుకు సాగకుండా ఉక్రెయిన్ వాసులు వంతెనలను కూల్చేస్తున్నారు. అంతేకాదు తాజాగా రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసింది. అయితే ఇప్పటికే యుద్ధం విషయంపై ఈయూ కూటమి అధ్యక్షుడితో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడారు.
ఏకే 47 పట్టిన యంగెస్ట్ ఎంపీ స్వియాటొస్లావ్ యురాష్..ఉక్రెయిన్ పార్లమెంట్ కు ఎన్నికైన యువకుడు యంగెస్ట్ ఎంపీ 26 ఏళ్ల స్వియాటొస్లావ్ యురాష్.. ఏకే 47 ధరించి దేశంకోసం దేశంకోసం పోరుబాటలో నిలిచాడు.
ఏకే-47 చేతపట్టిన ఉక్రెయిన్ మహిళా ఎంపీ కీరా రుడిక్..ఏకే-47 చేతబట్టి నేను సైతం అంటున్న ఉక్రెయిన్ ఎంపీ కిరా రుడిక్ యుద్ధానికి సై అంటున్నారు. ఇప్పటికే కీరా రుడిక్ యుద్ధం మెళుకువలకోసం శిక్షణ కూడా ప్రారంభించారు.
ఇప్పటికే ఏకే-47 చేబట్టి కదన రంగంలోకి దిగిన ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో
దేశం కోసం నేను సైతం అంటున్న 79 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ..మరోవైపు రష్యాపై యుద్ధంలో నేను సైతం అంటు ఏకే 47 గన్ పట్టిన 79 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ.. వృద్ధురాలు వాలెంటినా కోన్‌స్టాంటీనొవాస్కా గన్ ను ఎలా పేల్చాలో శిక్షణ పొందుతున్నారు. ఈ మహిళా ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
బాక్సింగ్ క్రీడాకారులు సోదరులు.. మరోవైపు ప్రముఖ బాక్సింగ్ సోదరులు విటాలీ క్లిట్స్ చ్కో, వ్లాదిమిర్ క్లిట్స్ చ్కో మాతృదేశం కోసం యుద్ధంలో పాల్గొంటామని వెల్లదించారు. విటాలీని అభిమానులు ముద్దుగా ‘ఉక్కు పిడికిలి’ అని పిలుస్తుంటారు
Ukrainian great grandmother, Valentina Constantinovska, on an Ak-47, training to defend against a possible Russian attack. “Your mother would do it too,” she told me. pic.twitter.com/PnojqRir4K