UKRAINE STUDENTS: యుద్దానికి అంతమెప్పుడు..? యుక్రెయిన్ సిటీలన్నీ సర్వనాశనం..మా రికార్డుల మాటేంటి?

యుక్రెయిన్ దేశంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో చదువుకుంటున్న భారతీయ వైద్య విద్యార్థులను ఆదేశానికి పొరుగునే వున్న దేశాల్లోని వర్సిటీల్లో చేర్పిస్తామంటూ ఓ కేంద్ర మంత్రి ఓ ఉచిత హామీ ఇచ్చి వదిలేశారు. సాధ్యాసాధ్యాలపై క్లారిటీ లేకుండా అమాయక విద్యార్థుల్లో ఆశలు రేపిన సదరు మంత్రి ఇపుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.

UKRAINE STUDENTS: యుద్దానికి అంతమెప్పుడు..? యుక్రెయిన్ సిటీలన్నీ సర్వనాశనం..మా రికార్డుల మాటేంటి?
Indian Students
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 14, 2022 | 9:02 PM

UKRAINE STUDENTS WORRIED ABOUT THEIR FUTURE STUDIES: యుక్రెయిన్, రష్యా(Russia)ల మధ్య 19 రోజులుగా కొనసాగుతున్న యుద్దానికి అంతమెప్పుడు ? ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా అందరిలో వినిపిస్తున్నా.. యుక్రెయిన్ నుంచి బతుకు జీవుడా అంటూ భారత ప్రభుత్వ పుణ్యమాని స్వదేశం చేరిన యుక్రెయిన్ వైద్య విద్యార్థుల వ్యధ అంతులేనిది మారుతోంది. ఆరేళ్ళపాటు కన్నవారికి దూరంగా వుండేందుకు సిద్దపడి.. డాక్టర్లమయితే చాలు.. స్వదేశంలో రోగులకు సేవలందిస్తే చాలంటూ కలలతో యుక్రెయిన్ చేరిన వైద్య విద్యార్థుల భవిత ఇప్పుడు అగమ్యగోచరమైంది. మిడిమిడి ఙ్ఞానంతో ఓ కేంద్ర మంత్రి పోలండ్ వేదికగా చేసిన ప్రకటన వైద్య విద్యార్థులను మరింత కలవరానికి గురి చేసింది. యుక్రెయిన్ దేశంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో చదువుకుంటున్న వారిని ఆదేశానికి పొరుగునే వున్న దేశాల్లోని వర్సిటీల్లో చేర్పిస్తామంటూ సదరు కేంద్ర మంత్రి ఓ ఉచిత హామీ ఇచ్చి వదిలేశారు. సాధ్యాసాధ్యాలపై క్లారిటీ లేకుండా అమాయక విద్యార్థుల్లో ఆశలు రేపిన సదరు మంత్రి ఇపుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఒక్కోదేశంలో వైద్య విద్యావిధానం ఒక్కోలా వుంటుంది. ఆ విషయం తెలిసో.. తెలియకనో సదరు మంత్రి ఓ మాటిచ్చేసి మాయమైపోయారు. కాకపోతే చాలా దేశాలు మన దేశం నుంచి పెద్ద ఎత్తున వైద్యవిద్యార్థులను ఆకర్షించేందుకు భారతీయ వైద్య విద్యావిధానంలాగా కొన్ని మార్పులు చేసుకున్నాయి. అందులో చైనా(China), ఫిలిప్పీన్స్(Philippines) వున్నాయి. కానీ యుక్రెయిన్, బెలారస్(Belaras), జార్జియా దేశాల్లో వైద్య విద్యా యూరోపియన్ స్టాండర్డ్స్ దిశగా సాగుతున్నాయి. కానీ యూరోపియన్ అగ్రదేశాల స్థాయికి ఈ మూడు దేశాల వైద్య విద్య ప్రమాణాలు ఇంకా చేరుకోలేదు. దాంతో ఈ మూడు దేశాలు.. మరీ ముఖ్యంగా యుక్రెయిన్ దేశంలో వైద్య విద్య చదువుకున్న విద్యార్థులు మన దేశానికి తిరిగి వస్తే ఎఫ్.ఎం.జీ.ఈ. (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) రాసి అర్హత సాధించాల్సి వుంటుంది. ఈ అర్హత ఆధారంగానే వారికి దేశంలో మెడికల్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అదేసమయంలో మనదేశంలో పోస్టు గ్రాడ్యుయేషన్ వైద్య కోర్సులను అభ్యసించే అవకాశం దక్కుతుంది.

అలా కాకుండా విదేశాల వైపే వెళ్ళాలని యుక్రెయిన్ దేశంలో వైద్య విద్య పట్టభద్రులు భావిస్తే.. యుకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రత్యేకంగా మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తాయి. ఈ పరీక్షలు కూడా రెండు, మూడు దశల్లో నిర్వహించడం ద్వారా సమర్థులైన, అర్హులైన, అవగాహన వున్న విద్యార్థులను వడకడతాయి. ఇక ఇప్పుడు యుక్రెయిన్ వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడడానికి కారణం ఈ విధానాలేనని చెప్పక తప్పదు. ఆరేళ్ళ వైద్య విద్యా కోర్సును అభ్యసించేందుకు వెళ్ళిన భారతీయ విద్యార్థుల్లో ఇపుడు వివిధ సంవత్సరాల్లో వున్న వారున్నారు. వీరిలో మే నెలాఖరులో జరగబోయే ఫైనల్ ఎగ్జామ్ ‘క్రాక్’ పరీక్ష రాసి.. డిగ్రీ సర్టిఫికేట్‌తో ఇండియాకు వచ్చేయాలని కలలు కన్న వారు చాలా మంది వున్నారు. అలాంటి వారు తామున్న నగరాలకు ఏమీ కాదన్న ధీమాతో లోలోపలో కాసింత భయం వున్నా.. చివరికి క్షణం వరకు అంటూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ ప్రారంభించే దాకా.. రెండు, మూడు సార్లు భారత ఎంబసీలు హెచ్చరించే దాకా యుక్రెయిన్ వీడేందుకు ముందుకు రాలేదు. చివరికి హెచ్చరికల కారణంగా యుద్దం తీవ్రతతో భయపడుతూ స్వదేశానికి వచ్చేశారు. పేరెంట్స్ చేరిన ఆనందంలో కొన్ని రోజులు గడిపినా.. ఇప్పుడు వారిలో భయాందోళన వ్యక్తమవుతోంది. ఆరేళ్ళ ఫీజులను కట్టేసి.. రెండు నెలల్లో ఫైనల్ ఎగ్జామ్ రాసేసి.. సర్టిఫికేట్‌తో సగర్వంగా రావాల్సిన తాము.. బతుకుజీవుడా అంటూ ప్రాణాలు దక్కించుకునేందుకు వచ్చి.. భవిష్యత్తును దిక్కుతోచని స్థితికి చేర్చామా అన్న ఆందోళనలో ఫైనలియర్ వైద్య విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు.

యుద్దం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ముగిసేలోగా తమ రికార్డులున్న మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీల భవనాలు ధ్వంసం కాకుండా వుంటాయో లేదో తెలియదు. ఎందుకంటే యుక్రెయిన్ దేశంలో మెడికల్ యూనివర్సిటీలు, కాలేజీలు ఉన్న నగరాలు కీవ్, ఖార్కీవ్, వినిట్సియా, ఒడెస్సా, జఫ్రోజియా వంట నగరాలు యుద్దంలో విధ్వంసానికి గురవుతున్నాయి. రికార్డులన్నీ ధ్వంసమైతే తాము అయిదున్నరేళ్ళపాటు చదువుకున్న చదువులు వృధా అవడం, తమ పేరెంట్స్ పెట్టిన లక్షలాది రూపాయల వ్యయం వృధా అవుతుందేమోనన్న ఆందోళన వైద్య విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రికార్డులు మిగిలి వుంటే ఏ ఆన్‌లైన్ క్లాసులో జరిపించి.. ఫైనల్ ఎగ్జామ్ కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించి తమకు మెడికల్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇస్తే సరి లేకపోతే తమ ఆరేళ్ళ చదువులు నిరుపయోగం అయి తమ భవిష్యత్తు అంధకారబంధురమవుతుందన్న విచారంలో పడిపోయారు యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికల్ కోర్టు ఫైనలియర్ విద్యార్థులు. ఇక మిగిలిన వైద్య విద్యార్థులకు ఓ సెమిస్టర్‌ని వాయిదా వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కానీ వీరి రికార్డులు కూడా అందుబాటులో వుంటే సరి లేకపోతే.. వారి పరిస్థితి ఏంటి అన్న ఆందోళన మరింత కుంగదీస్తోంది. ఆపరేషన్ గంగ ప్రారంభించిన తొలినాళ్ళలో వున్న చిత్తశుద్ది కేంద్రానికి లేదేమో అన్న సందేహాలను వైద్య విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ఏది జరగాలన్నా యుద్దానికి ముగింపు లభించాల్సిందే కాబట్టి లోలోపల కుమిలిపోతున్నా వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు యుక్రెయిన్ నుంచి బతుకు జీవుడా అంటూ వచ్చేసిన వైద్య విద్యార్థులు. వీరి విషయంలో ఏం చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకుంటేనే యుద్దం ముగిసిన వెంటనే కార్యాచరణ ప్రారంభించవచ్చని కోరుతున్నారు. లేకపోతే మరింత జాప్యం జరిగి తమ జీవితాలు దెబ్బతింటాయన్న మనోవ్యధకు గురవుతున్నారు.

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!