Russia-Ukraine War: ఒక్కరు కూడా తోడు లేరు.. ఒంటరి అయ్యాం: ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్

|

Feb 25, 2022 | 12:59 PM

ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. యుద్ధం మొదలైన రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్​పై బాంబుల వర్షం కురుస్తోంది. భారీ పేలుళ్ళ శబ్దాలతో నగరం అట్టుడుకుతోంది.

Russia-Ukraine War: ఒక్కరు కూడా తోడు లేరు.. ఒంటరి అయ్యాం: ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్
Ukraine President
Follow us on

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా దళాలు సైనిక దాడి ప్రారంభించడంతో కీవ్ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుద్ధం మొదలైన రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్(Kyiv)​పై బాంబుల వర్షం కురుస్తోంది.  బీభత్సమైన దాడులతో ప్రాణాలు నిలుపుకోవడమే చాలెంజింగ్‌గా మారిన సమయంలో జనం ఫుడ్, మెడిసిన్,పెట్రోల్‌ కోసం క్యూలు కడుతున్నారు. కీవ్‌ నగరాన్ని విడిచిపెట్టి.. వెస్టర్న్‌ ఉక్రెయిన్‌ వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ఆ వే లో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇళ్లు విడిచి అటు వెళ్దామనుకున్న కొంత మంది జనం.. తిరిగి ఇళ్లకే చేరుకున్నారు. ఎయిర్ డిఫెన్స్ అలారంతో కొంత మంది బంకర్లలోకి వెళ్లి తలదాచుకంటున్నారు. మొత్తంగా ఉక్రెయిన్ ఏకాకిగా మారిపోయింది. రష్యా ముప్పేట దాడితో విలవిలలాడిపోతోంది.  నాటో దేశాలన్నీ చేతులెత్తేసిన పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Ukrainian President Volodymyr Zelenskiy) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాటంలో ఒంటరిగా మిగిలామని పేర్కొన్నారు. నాటోలోని 30 దేశాలకు కాల్స్ చేశామని.. స్పందన లేక ఏకాకిమయ్యాం అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రష్యా దాడిలో ఇప్పటివరకు 137మంది ఉక్రెయిన్​ పౌరులు మరణించినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ వెల్లడించారు. వందల మంది గాయపడినట్లు చెప్పారు.

మరోవైపు జెలెన్​స్కీ కూడా కదనరంగంలోకి దూకారు. ఉక్రెయిన్‌ ఆర్మీ నిరుత్సాహ పడకుండా.. నేను కూడా మీతోనే ఉన్నానంటూ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. ప్రతిక్షణం రష్యా అటాక్స్‌ను పరిశీలిస్తున్న జెలెన్‌స్కీ..పుతిన్‌ను ఢీ కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేశం కోసం పోరాడాల్సి వస్తే ముందుండేది సైనికుడే. కానీ, ఆ సైనికుడి కంటే ముందు తానుంటానంటూ మనో ధైర్యం కల్పిస్తున్నారు. తమకు సాయం చేసేందుకు నాటో దళాలు సహా ఎవరూ ముందుకు రాకపోవడంతోదేశ పౌరులే ఆయుధాలు చేతబట్టి పోరాడాలని వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ సైన్యం తన పని తాను చేసుకుపోతుందన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు.. పరిస్థితి చేతులు దాటి పోతుండడంతో పౌరులకు పిలుపు ఇచ్చాడు. ఆపై సైన్యాన్ని వెంట ఉండి నడిపిస్తుండడం, సూచనలు ఇస్తుండడంతో.. సిసలైన నాయకుడంటూ సోషల్‌ మీడియా అభినందిస్తోంది.

Also Read: కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్’

అన్నం పాత్రలో ఉడికించితే మంచిదా..? ప్రెజర్ కుక్కర్‌లో వండితే మంచిదా?