షార్జా యువరాజు ఖాసిమీ సడెన్ డెత్

| Edited By:

Jul 04, 2019 | 6:10 PM

ఫ్యా షన్ రంగంలో శిఖరాలను అందుకోవాలని ఆశించిన షార్జా యువరాజు షేక్ ఖలీద్ బిన్ సుల్తాన్ ఖాసిమీ లండన్‌లో తన ఇంట్లో హఠాత్తుగా మృతి చెందాడు. ఆయన మృతితో షార్జా రాజు షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 2008లో ఖాసిమీ అనే బ్రాండ్‌ను పరిచయం చేసి ఫ్యాషన్ రంగంలో తనదైన న్యూ స్టైల్ క్రియేట్ చేశాడు ఖాసిమి. స్వతహాగా ఆర్కిటెక్చర్ చదివిన ఆయన.. లండన్‌లో ప్రఖ్యాతి గాంచిన సెంట్రల్ […]

షార్జా యువరాజు ఖాసిమీ సడెన్ డెత్
Follow us on

ఫ్యా షన్ రంగంలో శిఖరాలను అందుకోవాలని ఆశించిన షార్జా యువరాజు షేక్ ఖలీద్ బిన్ సుల్తాన్ ఖాసిమీ లండన్‌లో తన ఇంట్లో హఠాత్తుగా మృతి చెందాడు. ఆయన మృతితో షార్జా రాజు షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

2008లో ఖాసిమీ అనే బ్రాండ్‌ను పరిచయం చేసి ఫ్యాషన్ రంగంలో తనదైన న్యూ స్టైల్ క్రియేట్ చేశాడు ఖాసిమి. స్వతహాగా ఆర్కిటెక్చర్ చదివిన ఆయన.. లండన్‌లో ప్రఖ్యాతి గాంచిన సెంట్రల్ సెయింట్ మార్టిన్స్ ఆర్ట్ స్కూల్‌లో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేశాడు. అటు తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని భావించి తన పేరుతోనే ఖాసిమి అనే బ్రాండ్‌ను సృష్టించాడు. దీనికి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది.

అయితే ఖాసిమీ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చివరికి మూడు రోజులుగా మృత్యువుతో పోరాడి మ‌ృతి చెందాడు. ఈ మృతిపై లండన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. అనారోగ్యంతోనే ఖాసిమీ మృతిచెందినట్టుగా నిర్ధారించారు. 39 ఏళ్ల వయసులో ఖాసిమి మృతి చెందడంపై అరబ్ దేశాలన్నీ తీవ్ర సంతాపాన్ని తెలిపాయి.