US Executes Lisa Montgomery: మాతృత్వం కోసం మరో అమ్మ గర్భాన్ని చీల్చిన మహిళకు మరణ శిక్ష అమలు..

|

Jan 14, 2021 | 11:27 AM

బాల్యం లో జరిగే ఘటనలు మనుషుల జీవితాలను ఏ విధంగా మారుస్తుందో సజీవ సాక్ష్యం లీసా జీవితం. లేని మాతృత్వం కోసం 2004లో ఆమె మరో మహిళ గర్భాన్ని చీల్చింది. ఈ దారుణం చేసే సమయంలో లీసా..

US Executes Lisa Montgomery:  మాతృత్వం కోసం మరో అమ్మ గర్భాన్ని చీల్చిన మహిళకు మరణ శిక్ష అమలు..
Follow us on

US Executes Lisa Montgomery: దాదాపు 68 ఏళ్ల తర్వాత అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష విధించారు. స్నేహితురాలిని హత్య చేసి, గర్భాన్ని కోసి, బిడ్డను అపహరించిన నేరంలో కనాస్‌కు చెందిన లీసా మాంట్‌గోమెరీ(52)కు అమెరికా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేశారు. ఇండియానా రాష్ట్రం టెర్రేహాటేలోని జైలు ప్రాంగణంలో బుధవారం తెల్లవారుజామున మత్తు ఇంజెక్షన్ ను ఇచ్చారు. 1953 తర్వాత ఓ మహిళకు అమెరికాలో మరణశిక్ష విధించిన సంఘటన ఇదే. గతేడాది జులైలో మరణశిక్షలను అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ధరించారు. ట్రంప్ నిర్ణయం తర్వాత ఇప్పటి వరకు 11మందికి మరణశిక్ష అమలైంది. గత 17 ఏళ్లలో అమెరికాలో ఏ ఒక్కరికీ మరణశిక్ష విధించకపోవడం గమనార్హం. లీసా 2004లో బాబీజో స్టిన్నెట్(23) అనే మహిళను తాడుతో ఉరివేసి చంపింది. ఆ సమయంలో స్టిన్నెట్ 8 నెలల గర్భవతి. కాగా, వంటగదిలోని కత్తితో ఆమె కడుపును చీల్చి గర్భంలోని శిశువును లీసా బయటకు తీసింది. ఈ నేరానికి లీసాకు మరణశిక్షను అమెరికా కోర్టు ఖరారు చేసింది.

నిజానికి లీసా హంతుకురాలుగా మారడానికి ఆమె జీవితంలో అనుభవించిన ఆవేదనే కారణమని కొంత మంది వైద్యుల వాదన. ఆమె జీవితమంతా ఆవేదనల పర్వమే. పుట్టుకతోనే మానసిక సమతౌల్యం అంతగా లేదు. ఆమె తల్లి గర్భధారణ సమయంలో విపరీతంగా మద్యం సేవించడమే ఇందుకు కారణమని వైద్యులు భావిస్తున్నారు. సవతి తండ్రి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 14 ఏళ్ల వయసులో ఆమె తల్లి తనను బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది. ఆ నరకం నుంచి బయటపడేందుకు 18 ఏళ్లలోనే సవతి సోదరుడుని పెళ్లి చేసుకుంది. వారికి అయిదేళ్లలో నలుగురు పిల్లలు కలిగారు. తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంది. కాపురం హింసాత్మకం కావడంతో విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నా, గర్భం ధరించినట్టు రెండో భర్తతో తరచూ అబద్ధమాడేది. మొదటి భర్త వచ్చి ఎక్కడ నిజం చెప్పేస్తాడేమోనని భయపడేది. మానసికంగా కుంగిపోయిన ఆమె..భర్తను నమ్మించేందుకు మరో అమ్మ గర్భాన్ని చీల్చింది..

బాల్యం లో జరిగే ఘటనలు మనుషుల జీవితాలను ఏ విధంగా మారుస్తుందో సజీవ సాక్ష్యం లీసా జీవితం. లేని మాతృత్వం కోసం 2004లో ఆమె మరో మహిళ గర్భాన్ని చీల్చింది. ఈ దారుణం చేసే సమయంలో లీసా వయసు 36 ఏళ్ళు.  మిస్సోరీలోని స్కిడ్‌మోర్‌కు చెందిన 23 ఏళ్ల బాబీ జో స్టిన్నెట్‌ అనే 8 నెలల గర్భిణి పరిచయమయింది. ఆమెతో తానూ గర్భవతినే అంటూ పరిచయం పెంచుకుంది. 2004 డిసెంబరు 16న బాబీ ఇంటికి వెళ్లింది. తాడుతో బాబీ పీక నులిమి హత్య చేసింది. వంట గదిలో ఉపయోగించే చాకుతో ఆమె గర్భాన్ని కోసి ఆడ శిశువును బయటకు తీసింది. ఇలా హత్య చేస్తున్న సమయంలో బాబీ తల్లి ఇంట్లోనే ఉంది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది., పోలీసులు లీసాను అదుపులోకి తీసుకుని పిల్లని బాబీ భర్తకు అప్పగించారు. ఆ పాపా తండ్రి వద్దనే పెరుగుతుంది. ఇప్పుడు 16 ఏళ్ల వయసు. తాను తన రెండో భర్త వద్ద మాతృత్వం నిరూపించుకోవడానికి ఈ హత్య చేశానని పోలీసు విచారణలో వెల్లడించింది. 2007 లో మరణ శిక్ష ఖరారైంది. తాజాగా ఆ శిక్ష అమలు అయ్యింది.

Also Read: పట్టుపరికిని, పాపిడి బిళ్ల కుందనపు బొమ్మలా పవన్ తనయ ఆధ్య సంక్రాంతి సంబరాలు