పాకిస్తాన్ లోని కరాచీలో ఇద్దరు చైనీయులపై కాల్పులు.. బైక్ పై దుండగుల పరారీ

| Edited By: Phani CH

Jul 28, 2021 | 4:13 PM

పాకిస్తాన్ లోని కరాచీలో ఇద్దరు చైనీయులపై దుండగులు కాల్పులు జరిపారు. బుధవారం బైక్ పై వచ్చిన వీరు చైనీయులను గుర్తించి హఠాత్తుగా వారిపై కాల్పులు జరిపి పరారైనట్టు అధికారులు తెలిపారు.

పాకిస్తాన్ లోని కరాచీలో ఇద్దరు చైనీయులపై కాల్పులు.. బైక్ పై దుండగుల పరారీ
Two Chinese Shot In Karachi
Follow us on

పాకిస్తాన్ లోని కరాచీలో ఇద్దరు చైనీయులపై దుండగులు కాల్పులు జరిపారు. బుధవారం బైక్ పై వచ్చిన వీరు చైనీయులను గుర్తించి హఠాత్తుగా వారిపై కాల్పులు జరిపి పరారైనట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సివిల్ ఆసుపత్రికి తరలించినట్టు వారు చెప్పారు. దుండగులు ఎందుకు ఈ హత్యా యత్నం చేశారో తెలియాల్సి ఉందని వారన్నారు. అయితే ఈ ఘటనను చైనా తేలికగా పరిగణించింది. ఇది కాకతాళీయంగా జరిగిన ఘటన అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు. పాకిస్తాన్ లో ఉన్న చైనీయులను, వారి ఆస్తులను పాక్ ప్రభుత్వం రక్షిస్తుందని, ఆ నమ్మకం తమకు ఉందని ఆయన చెప్పారు. అయితే ఈ నెల 14 న ఖైబర్ పంక్తుత్వా లోని అప్పర్ కోహిస్తాన్ లో గల దాసు డ్యాం కు చైనా ఇంజనీర్లతో వెళ్తున్న ఓ బస్సుపేలిపోయిన ఘటనలో 9 మంది చైనీయులతో బాటు 13 మంది మరణించారు. బస్సు దగ్గరలోని లోయలో పడిపోయింది. బస్సులోని డివైజ్ పేలిపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పాక్ అధికారులు చెప్పినప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తం చేసింది. బహుశా ఇది టెర్రరిస్టు చర్య అయి ఉండవచ్చునని సూత్రప్రాయంగా పేర్కొంది.

2019 లో గ్వాడార్ లో సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. కొందరు గాయపడ్డారు. ఏమైనా పాకిస్తాన్ లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టి తన మిత్ర దేశంగా మార్చుకుంది. పాక్ ఆర్మీ లో రెండు ప్రత్యేక సెక్యూరిటీ డివిజన్లను ఏర్పాటు చేసి.. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఈ విభాగాలకు అవసరమైన వనరులు ఇవ్వడం వంటి ‘సహాయక’ చర్యలను చేబట్టింది. జమ్మూపై ఆ మధ్య ఎగిరిన డ్రోన్లు చైనాలో తయారైనవేనని జమ్మూ కాశ్మీర్ అధికారులు పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Raj Kundra Case: రాజ్ కుంద్రా కు బెయిల్ తిరస్కరించిన ముంబై కోర్టు.. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విన్నపానికి అంగీకారం..

Dasyam Vijayabhaskar : రైల్ రోకో కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు జైలు శిక్ష.. పూర్తి వివరాలు