US Plane Crash: ఇళ్ల మధ్య కుప్పకూలిన విమానం.. ఇద్దరు దుర్మరణం.. మరో ఇద్దరికి..

US Flight Accident: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా విమానం కుప్పకూలింది. యూఎస్ క్యాలిఫోర్నియా సాంటీలోని నివాస ప్రాంతంలో

US Plane Crash: ఇళ్ల మధ్య కుప్పకూలిన విమానం.. ఇద్దరు దుర్మరణం.. మరో ఇద్దరికి..
Us Plane Crash

Updated on: Oct 12, 2021 | 7:04 AM

US Flight Accident: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా విమానం కుప్పకూలింది. యూఎస్ క్యాలిఫోర్నియా సాంటీలోని నివాస ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం విమానం కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. రెండు ఇళ్లు, ట్రక్ ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పైలట్, యూపీఎస్ డ్రైవర్ మరణించారని పేర్కొన్నారు.

పాఠశాల సమీపంలో అకస్మాత్తుగా విమానం కుప్పకూలి రోడ్డుపైకి దూసుకొచ్చిందని.. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. విమానం, పలు వాహనాలు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. కాగా.. సమాచారం మేరకు వెంటనే చేరుకున్న సిబ్బంది.. మంటల్లో చిక్కుకున్న వారిని మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ట్విన్-ఇంజిన్ విమానం గ్రీన్‌కాజిల్.. జెరెమీ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో దాదాపు పది ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ట్విన్ ఇంజన్ విమానం గాలిలో ఎగిరిన కాసేపటికే కుప్పకూలినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

 

Also Read:

Corona Vaccine: మొట్ట మొదటి కరోనా టీకా స్ఫుత్నిక్.. యూకే టీకా ఫార్ములా దొంగిలించి తయారు చేశారా? వ్యాక్సిన్ పై కొత్త రచ్చ!

ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. చుక్కలను తాకిన నిత్యావసరాల ధరలు.. లీటరు పాలు రూ.1,195, గ్యాస్ రూ.2,657..!