Tunisia Protests : ట్యునిషియా లో మళ్ళీ ఆందోళన బాట పట్టారు. సామజిక, ఆర్ధిక సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసనలతో హోరెత్తించారు. దాదాపు పదేళ్ల క్రితం తమ దేశంలో దారిద్య్రం తాండవిస్తుంది.. నిరంకుశత్వ పాలన వద్దు అంటూ నియంత జీన్ ఎల్ అబిదిన్ బెన్ అలీనికు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. విజయం సాధించారు. తిరిగి పదేళ్ళ తర్వాత మళ్ళీ వారు ఆందోళ బాట పట్టారు.
ప్రభుత్వం పదేళ్ళ క్రితం చేసిన హామీలను ఇప్పటివరకూ అమలు చేయలేదంటూ… ట్యునీషియన్లు మరోసారి నిరసనలు చేపట్టారు. సామాజిక, ఆర్థిక సంస్కరణలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 16 నగరాల్లో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. “సామాజిక న్యాయం, పని కోసం వీధుల్లోకి వచ్చా” మని కార్మికులు ఎక్కువగా వుండే ఎత్తెదామెన్ ప్రాంతానికి చెందిన కొంతమంది ఆందోళనకారులు వ్యాఖ్యానించారు.
అయితే ఈ ఆందోళనపై ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విధ్వంసకాండ, దోపిడీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2011లో ఆనాటి నియంతని పదవీచ్యుతుడిని చేసేందుకు జరిగిన తిరుగుబాటు 10వ వార్షికోత్సవం ముగిసిన రెండు రోజులకే ఈ ఆందోళనలు తలెట్టడం గమనార్హం. ఈ ఆందోళనలు జరుగుతుండగానే కొవిడ్ పేరుతో లాక్‌డౌన్‌ను అధికారులు ప్రకటించారు. కాగా ఆందోళననలు, ప్రదర్శనలను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేసిందని నిరసనకారులు చెప్పారు. ఆందోళన చేస్తున్న వారిని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగించారు. దాదాపు వెయ్యి మందిని అరెస్టు చేశారని పౌర సంస్థలు తెలిపాయి. వారిని విడుదల చేయాలంటూ శాంతియుతంగా నిరసనలు కూడా చేపట్టారు.
Also Read : మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వినియోగదారులు తెలుసుకోవలసిన టాక్స్ బెనిఫిట్స్