Tirumala: టీటీడీ పాలక మండలి సమావేశం.. ఛైర్మన్ భూమన కీలక నిర్ణయాలు..

|

Mar 11, 2024 | 3:30 PM

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల దేశంలోనే కాక యావత్ ప్రపంచంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠంగా పిలువబడే వరాహా క్షేత్రంలో వేంకటేశ్వరుడిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. వారి సౌకర్యాల నిమిత్తం టీటీడీ పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ఉద్యోగుల విషయంలో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర అతిథి గృహంలోని అన్నమయ్య భవన్ లో సోమవారం నిర్వహించారు.

Tirumala: టీటీడీ పాలక మండలి సమావేశం.. ఛైర్మన్ భూమన కీలక నిర్ణయాలు..
Ttd Chairmen Bhumana Karuna
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల దేశంలోనే కాక యావత్ ప్రపంచంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠంగా పిలువబడే వరాహా క్షేత్రంలో వేంకటేశ్వరుడిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. వారి సౌకర్యాల నిమిత్తం టీటీడీ పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ఉద్యోగుల విషయంలో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర అతిథి గృహంలోని అన్నమయ్య భవన్ లో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈవో ధర్మారెడ్డితో పాటు బోర్టు సభ్యులు పాల్గొన్నారు. పాలకమండలి సమావేశం తరువాత టీటీడీ ఛైర్మన్ భూమన మీడియా సమావేశం నిర్వహించారు. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్ గా పరిగణలోకి తీసుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. దశాబ్ధాలుగా పెండింగ్లో ఉన్న ఈ నిర్ణయంతో వేలాది మంది టీటీడీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. అలాగే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని మరింత సుందరంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సుదూరప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు 479 మంది నర్సు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనిపై పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. టీటీడీ పరిధిలోని పాఠశాల, కళాశాలల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన నూతన భవనాల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిపించాలని ఆదేశించారు. యాత్రికుల వసతి దృష్ట్యా వసతి సముదాయాల్లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుమల చుట్టూ రూ. 1.50 కోట్లతో ఔటర్ ఫెన్సింగ్ రూపొందించాలని దీనికి సంబంధించిన పనులు వెంటనే జరిగేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. వీటితో పాటు దేవస్థాన ఉద్యోగుల వసతి సముదాయాల అభివృద్ది కోసం రూ. 14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలో మకరతోరణానికి, కళ్యాణ వేంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలకు బంగారు పూత చేయించేందుకు ఆమోదం తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవస్థానాల అభివృద్దికి పై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రీప్లేస్మెంట్ నిర్మహణకై రూ. 12 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..