Tsunami Alert: సముద్రంలో భారీ భూకంపం.. టోంగా దేశానికి సునామీ హెచ్చరిక.. సమోవా తీరానికి తాకిన అలలు..

|

Nov 12, 2022 | 5:46 AM

ద్వీప దేశమైన టోంగా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో శుక్రవారం భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై 7.3గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో అధికారులు దేశంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Tsunami Alert: సముద్రంలో భారీ భూకంపం.. టోంగా దేశానికి సునామీ హెచ్చరిక.. సమోవా తీరానికి తాకిన అలలు..
Tsunami Alert
Follow us on

ద్వీప దేశమైన టోంగా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో శుక్రవారం భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై 7.3గా భూకంప తీవ్రత నమోదైంది. దీంతో అధికారులు దేశంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. శక్తివంతమైన భూకంపంతో దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. శుక్రవారం .. టోంగాకు తూర్పు-ఆగ్నేయంగా 211 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూకంప కేంద్రం సముద్రంలో 24.8 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సముద్రం లోపల భూప్రకంపనలు సంభవించడంతో టోంగా దేశం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. భూకంపం కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశముందని హెచ్చరించింది. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్టం తక్కువగా ఉండే అవకాశం ఉందని యుఎస్‌జిఎస్‌ తెలిపింది. US సునామీ హెచ్చరిక వ్యవస్థ సైతం సునామీ వచ్చే అవకాశముందని హెచ్చరించింది.

పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (PTWC) ప్రకారం.. అమెరికన్ సమోవా ద్వీపంలో కూడా సునామీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇది టోంగా, నయాఫు, అమెరికన్ సమోవా తీరాలను ప్రభావితం చేసే అవకాశముందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరించింది. దీంతో ప్రజలకు ఇళ్లను విడిచి ఎత్తైన ప్రాంతాలకు చేరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది జనవరిలో టోంగాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. తాజాగా.. సునామీ హెచ్చరికలతో ప్రజలు ఎత్తైన ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ ద్వీప దేశంలో సుమారు లక్షమందికి పైగా నివాసముంటారని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..