USA: టెక్‌ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్‌… ఇండియన్స్‌ను ఇంటికి పంపించేస్తారా..?

సబ్బు, పేస్ట్, టీపొడి, నాలుగు ఎగ్స్‌.. ఎంతైందో చెప్పమంటే టక్కున నోటిలెక్కలతో చెప్పేయగలరు మన పిల్లలు. ఇదే లెక్క అమెరికన్‌ను అడగండి. కాలిక్యులేటర్‌ తీస్తాడు, కంప్యూటర్‌ ముందు కూర్చుంటాడు. యూఎస్‌లో యూనివర్సిటీ క్లాస్‌రూమ్స్‌లో చూస్తే... ఇండియన్స్‌ అండ్‌ ఫారెనర్సే ఎక్కువగా కనిపిస్తారు. గ్రాడ్యుయేషన్‌ రేంజ్‌కు వెళ్తున్న అమెరికన్స్‌ చాలాచాలా తక్కువ. మరి.. 'భారతీయులకు ఉద్యోగాలివ్వొద్దు, టెక్‌ కంపెనీలు భారత నిపుణులను నియమించుకోవద్దు' అని వార్నింగ్స్‌ ఇస్తే అమెరికన్‌ కంపెనీలను మూసుకోవాల్సిందేగా. 

USA: టెక్‌ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్‌... ఇండియన్స్‌ను ఇంటికి పంపించేస్తారా..?
Donald Trump

Updated on: Jul 25, 2025 | 9:38 PM

ఇప్పటికిప్పుడు అమెరికాలో 40 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 40 లక్షల వర్క్‌ఫోర్స్‌ ఇండియన్సే అంటే చిన్న నెంబర్‌ కాదది. 2015లో.. అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు 20 లక్షల మంది. 2018 నాటికి 22 లక్షల మంది, 2020లో 26 లక్షల మంది, 2023లో 35 లక్షల మంది. ఇప్పుడు… 40 లక్షల మంది. ప్రతి ఏటా లక్షల మంది భారతీయులను అమెరికా కంపెనీలు ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాయి. ఆ టాలెంటే ఉండుంటే అమెరికన్లకే అక్కడి ఉద్యోగాలు దక్కేవిగా. మరి భారతీయులనే ఎందుకు తీసుకుంటున్నారు? బహుశా ట్రంప్‌కు కారణం తెలియదో, పైకి పచ్చిగా చెప్పుకోలేరో మరి…! 2023-24లో 2 లక్షల 68వేల 923 మంది భారతీయ విద్యార్ధులు అమెరికన్‌ యూనివర్సిటీస్‌లో చేరారు. ప్రపంచంలోని మరే దేశం నుంచి ఈ స్థాయిలో అమెరికా వెళ్లి చదువుకుంటున్న వాళ్లు లేరు. సైన్స్‌&టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్ధుల విషయంలో చైనాను ఎప్పుడో ఓవర్‌టేక్‌ చేశాం మనం. అమెరికాలో ఆప్షనల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్-OPT ఉంటుంది. స్టెమ్‌ కోర్సులు చదివే వాళ్లకు మూడేళ్లపాటు టెంపరరీగా జాబ్‌ చేయడానికి అవకాశం ఉంది. అమెరికాలో చదివే ఏ విద్యార్ధి అయినా దీన్ని ఎంచుకోవచ్చు. బట్.. ఈ OPTలో 48 శాతం ఉండేది భారతీయులు మాత్రమే. 2023-24లో 97వేల 556 మంది ఎన్‌రోల్‌ అయితే… 79వేల 200 మందికి OPT పిరియడ్‌ అయిపోవడంతోనే వర్క్‌ ఎక్స్‌పీరియెన్స్ వచ్చేసింది. ఆ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి