Donald Trump: భారత్‌ చాలా గొప్పదేశం.. ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం

గాజాలో నిర్వహించిన శాంతి సదస్సులో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారతదేశం చాలా గొప్ప దేశమని.. భారత్‌లో తనకు చాలా మంచి స్నేహితుడు ఉన్నాడని.. ఆయన చాలా అద్బుతమైన పని చేశాడని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. అలాగే భారత్-పాక్ శాంతి పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.

Donald Trump: భారత్‌ చాలా గొప్పదేశం.. ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం
Donald Trump

Updated on: Oct 14, 2025 | 7:39 AM

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫట్టా అల్-సిసితో కలిసి షర్మ్ ఎల్-షేక్‌లో గాజా శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్‌పై ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. భారతదేశం చాలా గొప్ప దేశమని.. భారత్‌తో తనకు చాలా మంచి స్నేహితుడు ఉన్నాడని ఆయన చాలా అద్బుతమైన పిచేశాని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. అలాగే భారత్-పాక్ శాంతి పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భారతదేశం, పాకిస్తాన్ “చాలా చక్కగా కలిసి జీవిస్తాయి” అని అన్నారు.

గాజా శాంతి సమావేశంలో కీర్తి వర్ధన్ సింగ్ ట్రంప్‌ను కలిశారు

భారత్‌ తరపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక రాయబారిగా హాజరయ్యారు. గాజాలో శాంతి కార్యక్రమాలు, మానవతా సహాయం కోసం భారత్‌ మద్దతు గురించి చర్చించడానికి సింగ్ అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్‌ను అధికారికంగా కలిసిన తొలి భారత విదేశాంగ సహాయ మంత్రిగా ఆయన నిలిచారు.

ట్రంప్ శాంతి ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని మోదీ

గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అచంచలమైన శాంతి ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు . X లో ఒక పోస్ట్‌లో, రెండు సంవత్సరాలకు పైగా హమాస్ బందీలుగా ఉండి, ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక మొదటి దశలో భాగంగా ఈరోజు ఉదయం విడుదలై, చివరకు ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చిన చివరి 20 మంది బందీల తిరిగి రావడాన్ని కూడా ప్రధానమంత్రి స్వాగతించారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.