AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మీరు అందంగా ఉన్నారు.. కానీ, ఆ ఒక్క అలవాటు మానుకోండి.. ఇటలీ ప్రధాని రియాక్షన్ చూశారా..?

అక్కడున్న వారంతా పలు దేశాలకు సంబంధించిన అగ్రనేతలు.. కానీ.. అక్కడ ఓ సరదా సన్నివేశం జరిగింది.. ఓ మహిళా ప్రధానమంత్రికి.. మరో దేశ అధ్యక్షుడు.. ఓ సలహా ఇవ్వడం వైరల్‌గా మారింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది..

Viral Video: మీరు అందంగా ఉన్నారు.. కానీ, ఆ ఒక్క అలవాటు మానుకోండి.. ఇటలీ ప్రధాని రియాక్షన్ చూశారా..?
Erdogan, Giorgia Meloni, Emmanuel Macron
Shaik Madar Saheb
|

Updated on: Oct 14, 2025 | 12:49 PM

Share

అక్కడున్న వారంతా పలు దేశాలకు సంబంధించిన అగ్రనేతలు.. కానీ.. అక్కడ ఓ సరదా సన్నివేశం జరిగింది.. ఓ మహిళా ప్రధానమంత్రికి.. మరో దేశ అధ్యక్షుడు.. ఓ సలహా ఇవ్వడం వైరల్‌గా మారింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నవ్వుతూ కనిపించడంతోపాటు.. పలు సరదా వ్యాఖ్యలు చేశారు.

అసలేం జరిగిందంటే..

ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్ శాంతి సదస్సులో ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు సహా ప్రపంచ నాయకులు తీవ్ర చర్చలు జరిపారు. యుద్ధం విరమణ, గాజాలో శాంతి కోసం.. పలు తీర్మానాలు కూడా చేశారు.. ఈ క్రమంలోనే.. ప్రపంచ నేతల మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది.

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్.. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడారు.. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ కూడా ఉన్నారు. ఈ వీడియోలో.. ఎర్డోగాన్ నవ్వుతూ మెలోనీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమెతో సరదాగా సంభాషించారు..

వీడియో చూడండి..

మీరు విమానం నుంచి దిగుతుండగా మిమ్మల్ని చూశాను.. మీరు చాలా అద్భుతంగా.. చాలా అందంగా ఉన్నారు. కానీ నేను మిమ్మల్ని ధూమపానం (సిగరెట్ తాగడం) మానేయమని కోరుతున్నా.. అంటూ ఎర్డోగన్ చమత్కరించారు..

వెంటనే నవ్వుతూ స్పందించిన మెలోని.. నాకు తెలుసు, నేను ఎవరినీ చంపాలనుకోవడం లేదు.. అంటూ బదులిచ్చారు..

అయితే.. పక్కనే నిలబడి వారిద్దరి సంభాషణను విన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నవ్వుతూ.. జోక్యం చేసుకున్నారు. ఇది అసాధ్యం అంటూ బదులు ఇచ్చారు.

కాగా.. ఇటలీ ప్రధాని మెలోనీ గతంలో 13 ఏళ్ల పాటు సిగరెట్ తాగడం మానేసి.. ఇటీవలే తిరిగి ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు