ఎర్ర సముద్రంలో మునిగిపోయిన టూరిస్ట్ బోటు..16 మంది గల్లంతు.. అందరూ విదేశీయులే..

|

Nov 26, 2024 | 7:05 PM

అయితే, బోటు సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అల బోటును గట్టిగా ఢీకొట్టిందని అందువల్లే బోటు మునిగిపోయిందని అధికారులు వివరించారు. అల తాకిన సమయంలో కొంతమంది ప్రయాణికులు తమ క్యాబిన్లలో ఉండటం వల్ల బయటకు వచ్చే అవకాశం లేకుండా చిక్కుకుపోయారని సమాచారం.

ఎర్ర సముద్రంలో మునిగిపోయిన టూరిస్ట్ బోటు..16 మంది గల్లంతు.. అందరూ విదేశీయులే..
Tourist Boat
Follow us on

ఎర్ర సముద్రంలో టూరిస్టు బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయిన సంఘటన కలకలం రేపింది. బోటు ప్రమాదంలో విదేశీయులు సహా 18 మంది గల్లంతయ్యారు. బోటులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వీరిలో 31 మంది పర్యాటకులు కాగా, 13 మంది సిబ్బంది అని అధికారులు తెలిపారు. మునిగిపోయిన పర్యాటక బోటు ప్రమాదంలో గల్లైంత వారిలో నుంచి 28 మందిని రక్షించారు. రంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారని వెల్లడించారు. గల్లంతైన పడవలో అమెరికా, జర్మనీ, బ్రిటన్, పోలాండ్, బెల్జియం, ఫిన్లాండ్, చైనా, స్లోవేకియా, స్పెయిన్, ఐర్లాండ్ దేశాలకు చెందిన 31 మంది విదేశీయులు ఉన్నాట్టుగా అధికారులు వెల్లడించారు.

ఈజిప్టు తీరానికి సమీపంలో జరిగిన ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. 13 మంది సిబ్బందితో సహా 44 మందితో ఉన్న లగ్జరీ యాచ్ ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. నవంబర్‌ 25 సోమవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. ‘సీ స్టోరీ’ బోట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని, వారి ప్రయాణానికి ముందు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని అధికారులు తెలిపారు. నావిగేషనల్ భద్రతకు సంబంధించి కూడా పూర్తి చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు.

అయితే, బోటు సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అల బోటును గట్టిగా ఢీకొట్టిందని అందువల్లే బోటు మునిగిపోయిందని అధికారులు వివరించారు. అల తాకిన సమయంలో కొంతమంది ప్రయాణికులు తమ క్యాబిన్లలో ఉండటం వల్ల బయటకు వచ్చే అవకాశం లేకుండా చిక్కుకుపోయారని సమాచారం. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..