Edible Cement: ఆ దేశంలో పెరిగిపోతున్న ఫుడ్ వేస్టేజ్.. వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తూ.. సిమెంట్‌ను తయారు చేసిన శాస్త్రవేత్తలు

|

Jun 07, 2022 | 11:50 AM

ప్రపంచాన్ని ప్లాస్టిక్ సమస్య ఎంత తీవ్రమైన వేధిస్తుందో.. జపాన్‌ దేశంలో ఫుడ్ వేస్టేజ్ సమస్య కూడా అదే స్థాయిలో ఉంది. ఈ దేశంలో ఆహార వ్యర్థాలు భారీగా పేరుకుంటాయి.

Edible Cement: ఆ దేశంలో పెరిగిపోతున్న ఫుడ్ వేస్టేజ్.. వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తూ.. సిమెంట్‌ను తయారు చేసిన శాస్త్రవేత్తలు
Edible Cement
Follow us on

Making cement with food waste: వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తూ.. వాటిని తిరిగి ఉపయోగించుకునే విధంగా చేయడం వలన ఓ వైపు పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది.. మరోవైపు మానవ అవసరాలు తీరే అవకాశం ఉంది. ఈ మేరకు శాస్త్రజ్ఞలు నిరంతరం అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలో తమ దేశంలో భారీగా పేరుకుంటున్న ఆహార వ్యర్ధాలతో సిమెంట్ ను తయారు చేశారు. ఇప్పటి వరకూ సిమెంట్ , చెక్క వంటి వాటితో నిర్మాణాల గురించిమాత్రమే తెలుసు.. ఆహార పదార్ధాల వ్యర్ధాలతో సిమెంట్ ఏమిటి.. ఇది అసలు తినడానికా.. లేక నిర్మాణాలను కట్టడానికా అనుకుంటున్నారా.. వాస్తవానికి ఈ హర వ్యర్ధాల సాయంతో తయారు చేసే సిమెంట్ తో భారీ నిర్మాణాలను కట్టవచ్చట.. ఈ విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా రుజువు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

జపాన్‌కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఫుడ్ వేస్టేజ్‌తో సిమెంట్‌ను తయారు చేయవచ్చని అంటున్నారు. అంతేకాదు ఈ సిమెంట్ .. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న సిమెంట్ కంటే బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. ఈ సిమెంట్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. భవిష్యత్తులో ఏ నిర్మాణాలకు సిమెంట్‌తో పని ఉండదన్నారు. అంతేకాదు ఈ సిమెంట్ పర్యావరణ హితమైనదని దీనిలో పర్యావరణానికి హానికలిగించే ఎటువంటి హానికరమైన రసాయనాలు లేవని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రపంచం అంతా జపాన్ వైపు చూస్తోంది.

ప్రపంచాన్ని ప్లాస్టిక్ సమస్య ఎంత తీవ్రమైన వేధిస్తుందో.. జపాన్‌ దేశంలో ఫుడ్ వేస్టేజ్ సమస్య కూడా అదే స్థాయిలో ఉంది. ఈ దేశంలో ఆహార వ్యర్థాలు భారీగా పేరుకుంటాయి. జపాన్ 2019లో సుమారుగా 5.7 మిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలు పేరుకున్నాయి. ఇక రానున్న రోజుల్లో మరింతగా ఈ ఆహార వ్యర్ధాలు పెరగనున్నాయని.. అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశంలో ఫుడ్ వెస్టీజ్ సమస్య నివారణ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2030 నాటికి 2.7 మిలియన్ టన్నులను తగ్గించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ఇవి కూడా చదవండి

దీంతో టోక్యో యూనివర్శిటీకి చెందిన శాస్త్రజ్ఞులు కోటా మచిడా, యుయా సకాయ్ తమ తెలివి తేటలకు పదును పెట్టారు. సరికొత్త ఆవిష్కరణ దిశగా పరిశోధనలు ప్రారంభించి.. ఆహార వ్యర్థాలతో సిమెంట్‌ను తయారు చేస్తున్నారు.  టీ ఆకులు, నారింజ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, కాఫీ గ్రౌండ్‌లు, చైనీస్ క్యాబేజీ లతో పాటు తినగా మిగిలిపోయిన ఆహార పదార్ధాలను తమ పరిశోధనకు మెటీరియల్స్ గా ఎంచుకున్నారు. ఇప్పుడు వీటిని ఉపయోగించి సిమెంట్‌ను తయారు చేశారు.

ప్రపంచంలోనే ఇలా ఫుడ్ వేస్టేజ్ ట్ సిమెంట్ తయారు చేసి రికార్డ్ సృష్టించారు. ఈ సిమెంట్ ఎటువంటి నిర్మాణాలైనా చేసుకోవచ్చని.. నార్మల్ సిమెంట్ కంటే.. మరింత బలంగా దృఢంగా, నాణ్యతతో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సిమెంట్ ఆహార పదార్ధాలతో తయారు చేస్తున్నారు కనుక.. ఎలుకలు, పురుగులు వంటి వాటితో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది.. కనుక.. సిమెంట్ పై రక్షణగా ఓ గమ్ పూయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సిమెంట్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా చర్యలు మొదలు పెట్టారు. ఈ సిమెంట్‌ అందుబాటులోకి వస్తే..  గ్లోబల్ వార్మింగ్‌ తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..