Plane Crash: ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం.. గాలిలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు, ముగ్గురు పైలట్లు మృతి

పోరాటం చేస్తున్న సమయంలో రెండు L-39 కంబాట్ ట్రైనర్ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనపై ఉక్రెయిన్ రక్షణ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో మరణించిన ముగ్గురు సైనిక పైలట్లలో ఉక్రెయిన్ సైనిక అధికారి ఆండ్రీ పిల్షికోవ్ (సెకండ్ క్లాస్ పైలట్) కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు.

Plane Crash: ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం.. గాలిలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు, ముగ్గురు పైలట్లు మృతి
Ukrainian Military Pilots

Updated on: Aug 27, 2023 | 7:51 AM

ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో రెండు ఎల్-39 యుద్ధ శిక్షణ విమానాలు గగనతలంలో ఢీకొనడంతో ముగ్గురు పైలట్లు చనిపోయారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ వైమానిక దళం శనివారం వెల్లడించింది. పోరాట యాత్రలో శుక్రవారం ఈ సంఘటన జరిగిందని ఆయన చెప్పారు. ఆగస్టు 25న కీవ్‌కు పశ్చిమాన 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైటోమిర్ సిటీ సమీపంలో విమానం కూలిపోయిందని ఉక్రేనియన్ వైమానిక దళం తెలిపింది.

పోరాటం చేస్తున్న సమయంలో రెండు L-39 కంబాట్ ట్రైనర్ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనపై ఉక్రెయిన్ రక్షణ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో మరణించిన ముగ్గురు సైనిక పైలట్లలో ఉక్రెయిన్ సైనిక అధికారి ఆండ్రీ పిల్షికోవ్ (సెకండ్ క్లాస్ పైలట్) కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆగష్టు 25 న, రెండు L-39 సైనిక జెట్‌లు జైటోమిర్ ప్రాంతంపై ఢీకొన్నాయి. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన ముగ్గురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు 2వ తరగతి పైలట్.

మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. వారి సేవకు మేము కృతజ్ఞులం. అమరులైన వీరు స్వర్గంలో, భూమిపై జ్ఞాపకంగా మిగులుతారని పేర్కొన్నారు. ఉక్రేనియన్ ఎయిర్‌ఫోర్ట్ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, “బాధిత కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నాము” అని పేర్కొంది. ఈ ప్రమాదం తీరని నష్టమని.. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యా మధ్య

ఉక్రెయిన్..  రష్యా మధ్య గత ఒకటిన్నర సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి ఇరు దేశాల సైన్యాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ యుద్ధంలో రష్యా గెలిచింది లేదు.. ఉక్రెయిన్ ఓడిపోలేదు. రెండు దేశాల మధ్య ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పడం కష్టం. ఉక్రెయిన్ దేశానికి పాశ్చాత్య దేశాల నుండి నిరంతరం సహాయం అందుకుంటుంది.. ఈ సహాయంతో.. ఉక్రెయిన్ ఈ యుద్ధం రంగంలో నిలబడి రష్యాతో పోరాడుతూనే ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..