Antarctica: పెరుగుతున్న భూతాపంతో అంటార్కిటికాలోని మంచుఫలకాలకు ముంచుకొస్తున్న ముప్పు.. బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి

|

Apr 10, 2021 | 12:30 PM

అంటార్కిటికా ప్రాంతంలో మంచు ఫలకాలు సముద్రంలో శాశ్వతంగా తెలియాడుతుంటాయి. ఇవి తీరప్రాంతాల వెంబడి ఉంటాయి. నెల పై ఉన్న మంచు పర్వతాలు కరిగి సముద్రంలోకి వచ్చినపుడు ఇవి ఏర్పడతాయి.

Antarctica: పెరుగుతున్న భూతాపంతో అంటార్కిటికాలోని మంచుఫలకాలకు ముంచుకొస్తున్న ముప్పు.. బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి
Antarctica
Follow us on

అంటార్కిటికా ప్రాంతంలో మంచు ఫలకాలు సముద్రంలో శాశ్వతంగా తెలియాడుతుంటాయి. ఇవి తీరప్రాంతాల వెంబడి ఉంటాయి. నెల పై ఉన్న మంచు పర్వతాలు కరిగి సముద్రంలోకి వచ్చినపుడు ఇవి ఏర్పడతాయి. ఈ మంచుఫలకాలు నేరుగా నెల పై ఉన్న మంచు పర్వతాల నుంచి వచ్చే నీరు సముద్రంలో చేరిపోయి సముద్ర మొత్తాలను ఒకేసారి పెంచేయకుండా ఇవి చేస్తాయి. ఇప్పుడు ఈ మంచుఫలకాలకు ముప్పు ఎదురవుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మంచు ఫలాలపై బ్రిటన్ లోని రీడింగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. భూమి వేడెక్కడం వలన ఈ మంచు ఫలకాలు కరిగిపోయే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. భూతాపం నాలుగు డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే అంటార్కిటికాలోని మొత్తం మంచు ఫలకాల్లో 34 శాతం ముప్పులో పడతాయని ఆ శాస్త్రవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా అంటార్కిటికా ద్వీపకల్పంలో అతి పెద్ద హిమ ఫలకం లార్సన్ సి కి ఎక్కువ ముంపు పొంచి ఉందని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న గిల్బర్గ్ చెప్పారు.

”ఈ మంచు కుప్పకూలడం అంటే.. ఒక సీసాకు అమర్చిన భారీ మూతను ఒక్కసారిగా తెరవడం వంటిది. దీని వల్ల హిమానీదాల నుంచి భారీ పరిమాణంలో నీరు సముద్రాల్లో వచ్చి చేరుతుంది. అంటూ అయన వివరించారు. భూతాపాల పెరుగుదలను కట్టడి చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని చాలా వరకూ నివారించవచ్చని అయన చెప్పారు. భూతాపం పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గిస్తే తరిగిపోయే మంచు ఫలకాలు విస్తీర్ణాన్ని సగానికి తగ్గించవచ్చని చెప్పారు. దీనివల్ల సముద్ర మట్టం గణనీయంగా పెరగడాన్ని నివారించవచ్చని తెలిపారు. ఇప్పడు కరిగిన మంచంతా హిమ ఫలకాలు ఉపరితలంపై పేరుకుపోతున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆ ఫలకములో పగుళ్లు ఏర్పడి, సముద్రంలో కుప్పకూలే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. వీటిపై గతంలో నిర్వహించిన అధ్యయనాలు..మంచు తరుగుదల సంబంధించి అతి తక్కువ అంచానాలు మాత్రమే వెలుబుచ్చాయని చెప్పిన ఆయన, తాము మాత్రం అధునాతన హై రిజల్యోషన్ స్థానిక వాతావరణ నమూనాలనుఁ ఉపయోగించి సవివరంగా ఈ విషయాలను వెలుగులోకి తెచ్చామని ఆ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.

Also Read: మిల‌మిల‌ మెరిసే మంచు ఖండం.. ఇప్పుడు ఆకుపచ్చగా..

Antarctica Temperature: అంటార్కిటికాలో రికార్డు ఉష్ణోగ్రత.. మంచు ఖండం వేడెక్కుతోందా?