పసిబిడ్డల ఆకలి తీర్చి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న మాతృమూర్తి..
ఈ ప్రపంచంలో కల్తీ లేనిది ఏదైన ఉందంటే అది తల్లి పాలు మాత్రమే. శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లి పాలు ఎంతో ముఖ్యమైనవి. అయితే కొందరు పసిపిల్లలు మాత్రం పలు కారణాల వల్ల తమ తల్లి పాలకు దూరమవుతుంటారు. అందుకే కొంతమంది తల్లులు తమ బిడ్డలకు డబ్బా పాలు అందిస్తుంటారు.

ఈ ప్రపంచంలో కల్తీ లేనిది ఏదైన ఉందంటే అది తల్లి పాలు మాత్రమే. శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లి పాలు ఎంతో ముఖ్యమైనవి. అయితే కొందరు పసిపిల్లలు మాత్రం పలు కారణాల వల్ల తమ తల్లి పాలకు దూరమవుతుంటారు. అందుకే కొంతమంది తల్లులు తమ బిడ్డలకు డబ్బా పాలు అందిస్తుంటారు. అయితే ఓ మాతృమూర్తి మాత్రం ఎంతోమంది పిల్లలకు ఆకలి తీర్చింది. అత్యధికంగా తన పాలను దానం చేసి ఏకంగా గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఆమెనె అమెరికాలోని ఒరెగాన్‍కి చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రా. ఈమెకు ఇద్దరు సంతానం.
తన బిడ్డలకు పాలు ఇవ్వడంతో పాటు పాల బ్యాంకుకు విరాళంగా తన చనుబాలు అందించింది. 2015 నుంచి 2018 మధ్యలో ఏకంగా 1600 లీటర్ల చనుబాలు ఇచ్చి రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ బుక్‌లో ఆమెకు చోటు దక్కింది. తన భర్తది ఫ్యూర్టెరికో అనే ద్వీపం కావడంతో ఓసారి అక్కడికి వెళ్లానని సియెర్రా తెలిపింది. అక్కడ ప్రసవ సమయంలో తల్లిని కోల్పోయిన ఓ శిశువుకు పాలు ఇచ్చానని చెప్పింది. ఆ తర్వాత అలాగే కొనసాగిస్తూ వచ్చానని పేర్కొంది. మరో విషయం ఏంటంటే ఆమెకు హైపర్ లాక్టేషన్ అనే సిండ్రోమ్ ఉండటం వల్ల పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవని చెప్పింది. అందుకే చాలా మంది చిన్నారుల ఆకలి తీరిందని ఆనందం వ్యక్తం చేసింది.