World Most Happiest Country 2022: ప్రపంచంలో సంతోషకరమైన దేశాలు.. మళ్లీ అగ్రస్థానంలో ఆ దేశం

|

Mar 19, 2022 | 7:30 AM

World Most Happiest Country 2022: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంతోషకరమైన దేశంలో ఫిన్లాండ్‌ (Finland) మరోసారి టాప్‌లో నిలిచింది. యూరఫ్‌ దేశం ఫిన్లాండ్‌ మరోసారి సంతోషంగా..

World Most Happiest Country 2022: ప్రపంచంలో సంతోషకరమైన దేశాలు.. మళ్లీ అగ్రస్థానంలో ఆ దేశం
Follow us on

World Most Happiest Country 2022: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంతోషకరమైన దేశంలో ఫిన్లాండ్‌ (Finland) మరోసారి టాప్‌లో నిలిచింది. యూరఫ్‌ దేశం ఫిన్లాండ్‌ మరోసారి సంతోషంగా ఉండే విషయాలలో మరోసారి ప్రత్యేకత చాటుకుంది. సంతోషకరమైన దేశాల జాబితాలోఎ ఫ్లిన్లాండ్‌ నిలవడం ఇది ఐదోసారి. సంతోషంగా ఉండటం అంటే సంపన్నంగా, సర్వసౌఖ్యాలు ఉండటంకాదు సంతోషంగా ఉండటం అంటే మానసిక ప్రశాతంత కలిగి ఉండటం అని ఫిన్లాండ్ ను చూసి నేర్చుకోవాలి. వరుసగా ఐదవ సారి కూడా చిన్నదేశమైన ఫిన్లాండ్ నిలవడం గమనార్హం.

సంతోషకరంగా ఉన్న టాప్‌ 20 దేశాలు

ఈ సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ 2వ స్థానంలో నిలువగా, ఐస్ లాండ్ 3వ స్థానంలో నిలిచింది. 4వ స్థానంలో స్విట్జర్లాండ్, 5వ స్థానంలో నెదర్లాండ్స్, 6వ స్థానంలో లగ్జెంబర్గ్, 7వ స్థానంలో స్వీడన్, 8వ స్థానంలో నార్వే, 9వ స్థానంలో ఇజ్రాయెల్, 10వ స్థానంలో న్యూజిలాండ్ దేశాలు టాప్‌-10లో నిలిచాయి. ఇక 11వ స్థానంలో ఆస్ట్రీయా, 12వ స్థానంలో ఆస్ట్రేలియా, 13వ స్థానంలో ఐర్లాండ్‌, 14వ స్థానంలో జర్మనీ, 15వ స్థానంలో కెనడా, 16వ స్థానంలో అమెరికా, 17వ స్థానంలో బ్రిటన్‌, 18వ స్థానంలో చెక్‌ రిపబ్లిక్‌, 19వ స్థానంలో బెల్జియం, 20వ స్థానంలో ఫ్రాన్స్‌ నిలిచింది.

ఇక ఈ జాబితాలో భారత్ 136వ స్థానంలో నిలిచింది. గతం కంటే భారత్ మెరుగు సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలో భారత్ కంటే పొరుగుదేశాలు పాకిస్థాన్, శ్రీలంక ముందున్నాయి. పాకిస్థాన్ 121వ ర్యాంకు దక్కించుకోగా, శ్రీలంక 127వ స్థానాన్ని దక్కించుకోవటం విశేషం. ఇక లెబనాన్‌, జింబాబ్వే దేశాల తర్వాత ఆఫ్ఘానిస్థాన్ 146 చివరి స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: మూడు వారాల తర్వాత స్వదేశానికి చేరుకోనున్న న‌వీన్ మృత‌దేహం.. ఎప్పుడంటే..?

PM Narendra Modi: ప్రధాని మోడీనే నెంబర్‌వన్.. గ్లోబల్ లీడర్‌గా మరో రికార్డు తిరగరాసిన నమో..