Thiruvalluvar Statue: ఫ్రాన్స్‌లో కవి తిరువల్లువర్ విగ్రహం ఏర్పాటు.. ఇరు దేశాల సాంస్కృతిక బంధానికి నిదర్శనం అన్న ప్రధాని మోడీ

|

Dec 11, 2023 | 3:17 PM

ఈ విగ్రహం వేలాది మందికి స్ఫూర్తినిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ఫ్రాన్స్, భారతదేశం మధ్య సాంస్కృతిక సంబంధాలకు మరొక చిహ్నం. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రఫ్ కూడా విగ్రహాన్ని ఆవిష్కరించడం గురించి ట్వీట్ చేశారు. రాజధాని ప్యారిస్‌కు సమీపంలోని సెర్గి నగరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు విదేశాంగ మంత్రి తెలిపారు.

Thiruvalluvar Statue: ఫ్రాన్స్‌లో కవి తిరువల్లువర్ విగ్రహం ఏర్పాటు.. ఇరు దేశాల సాంస్కృతిక బంధానికి నిదర్శనం అన్న ప్రధాని మోడీ
Thiruvalluvar Statue
Follow us on

మనదేశానికి చెందిన ఆధ్యాత్మిక వేత్తలను, ఆయువేదాన్ని , యుద్ధ వీరులను ప్రపంచంలో అనేక దేశాలకు చెందిన ప్రజలు గౌరవిస్తారు. వారి జీవిత గాథలను తమ దేశ ప్రజలకు తెలియజేస్తారన్న సంగతి తెలిసిందే.. తాజాగా తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త, నీతిజ్ఞుడు తిరువళ్ళువార్ ను యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్ గౌరవిస్తూ సెర్గి నగరంలో తిరువళ్ళువార్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ విషయంపై ప్రధాని మోడీ స్పందిస్తారు. దక్షిణ భారతదేశంలోని గొప్ప సాధువు, తమిళ సాహిత్యానికి మకుటం వంటి వ్యక్తి విగ్రహం మన ఉమ్మడి సాంస్కృతిక సంబంధాలకు అందమైన నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జులైలో బాస్టిల్ డే కోసం పారిస్‌లో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారని, ఇప్పుడు విగ్రహావిష్కరణ  చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.

బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫ్రాన్స్‌లోని సెర్గిలో తిరువళ్ళువార్ విగ్రహ ప్రతిష్ట జరిపారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మన సాంస్కృతిక సంబంధాలకు అందమైన నిదర్శనం: ప్రధాని మోడీ

ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రఫ్ కూడా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫ్రాన్స్‌లోని సెర్గిలో ఉన్న తిరువల్లువర్ విగ్రహం మన భాగస్వామ్య సాంస్కృతిక సంబంధాలకు అందమైన నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. తిరువల్లువర్ తెలివితేటలకు, జ్ఞానానికి ప్రతీక. అతని రచనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయి.

ప్యారిస్ సమీపంలోని సెర్గి పట్టణంలో విగ్రహం ఏర్పాటు

ఈ విగ్రహం వేలాది మందికి స్ఫూర్తినిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ఫ్రాన్స్, భారతదేశం మధ్య సాంస్కృతిక సంబంధాలకు మరొక చిహ్నం. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రఫ్ కూడా విగ్రహాన్ని ఆవిష్కరించడం గురించి ట్వీట్ చేశారు. రాజధాని ప్యారిస్‌కు సమీపంలోని సెర్గి నగరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సెర్గి మేయర్ జీండన్, పుదుచ్చేరి మంత్రి కె. లక్ష్మీనారాయణ సహా పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

కవి తిరువళ్ళువార్ ఎవరంటే?

ఉత్తర భారతదేశంలోని తులసీదాస్, సూరదాస్, కబీర్ లు ఎంత ప్రసిద్దో.. దక్షిణ భారతదేశం తిరువళ్ళువార్ అంత ప్రసిద్ధ కవి. దక్షిణ భారతదేశంలో వల్లూవర్ అని పిలువబడే తిరువల్లూవర్ ఒక ప్రసిద్ధ తమిళ కవి, తత్వవేత్త. నీతి, రాజకీయ, ఆర్థిక విషయాలు, ప్రేమపై ద్విపదల సమాహారమైన తిరుక్కునా రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారు. సెయింట్ తిరువళ్ళువార్ ఆధారంగా అనేక విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పీఠాలు ఉన్నాయి. సెయింట్ తిరువళ్ళువార్ క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో జన్మించాడు. నాటి నుంచి నేటి వరకు దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటిలోనూ ఆయన పుస్తకాలు ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..