Indian-American School Kids: 15 ఏళ్ళు కూడా లేని ఈ అన్నా చెలెల్లు.. నెలసరి సంపాదన రూ 23 లక్షలు.. ఇప్పుడు ప్రపంచంలోనే ఫేమస్..
Indian-American School Kids: ఓ ఇద్దరు అన్నా చెల్లెలు .. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో.. తమ తెలివి తేటలకు పదును పెట్టారు.. ఏకంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నాచెల్లెలు..
Indian-American School Kids: ఓ ఇద్దరు అన్నా చెల్లెలు .. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో.. తమ తెలివి తేటలకు పదును పెట్టారు.. ఏకంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నాచెల్లెలు ప్రస్తుతం అమెరికాలో హాట్ టాపిక్.. అవును అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులైన కు చెందిన ఇద్దరు అన్నా చెల్లెళ్ళ అసామాన్య ప్రతిభ చూసి యావత్ అమెరికా ప్రజానీయం ముక్కుమీద వేలేసుకుంటుంది. ఎంతో ఉన్నత చదువులు చదివినవారు సైతం.. తమకు ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు చాలు అంటూ సరిపెట్టుకుంటున్న ఈరోజుల్లో.. ఈ ఇద్దరు చిన్నారులు తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఏడాదికి కోట్లల్లో సంపాదిస్తున్నారు. దీంతో వీరిద్దరూ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. మరి ఈ ఇద్దరు అన్నాచెల్లలు వయసు 15 ఏళ్ల లోపే కావడం విశేషం. మరి ఆ చిన్నారులు ఎవరు.. అమెరికాలో ఎక్కడ ఉంటారు.. ఇన్ని లక్షల ఆదాయం సంపాదించడానికి ఏమి చేస్తున్నారు.. ఎం చదువుకుంటున్నారు వివరాల్లోకి వెళ్తే..
టెక్సాస్ లో షాదాకుర్, చెల్లెలు అనన్య ఠాకూర్ లు నివాసం ఉంటున్నారు. అన్న వయసు 14 ఏళ్ళు, చెలెళ్ళు వయసు 9 ఏళ్ళు . ఈ ఇద్దరికీ రోజూ నిద్రపోయే ముందు తండ్రి చెప్పే కథలు వినడం హాబీ.. తండి చెప్పే మాటలు కథలు వింటూ.. తమ తెలివితేటలకు పదును పెట్టుకున్నారు. అయితే ఫిబ్రవరిలో షాదాకుర్ తండ్రి క్రిప్టో కరెన్సీ గురించి చెప్పాడు. దీంతో వీరి దృష్టి క్రిప్టో కరెన్సీ మీదకు మళ్లింది. వెంటనే దానిగురించి తెలుసుకోవడం ప్రారంభించారు. అయితే క్రిప్టో కరెన్సీ కంటే కూడా ఇతెరియం అయితే మరింత లాభసాటిగా ఉంటుందని తెలుసుకున్నారు. ఇతెరియం బిట్ కాయిన్ కు గట్టిపోటీ అని గ్రహించిన అన్నా చెల్లెలు ఇతెరియం కొనే పనిలో పడ్డారు.
అయితే ఇతెరియం కొనుగోలు చేయడానికి చాలా డబ్బులు కావాలి. దీంతో అప్పటి వరకూ వారు సెలవుల సమయంలో నిమ్మరసం అమ్మి సంపాదించిన డబ్బులను పెట్టారు. అయినా ఇతెరియం కొనుగోలు చేయడానికి ఆ డబ్బులు సరిపోలేదు.. దీంతో అన్నా చెల్లెలు తమ వద్ద ఉన్న గేమింగ్ ల్యాప్ట్ టాప్ ద్వారా ఇతెరియం మైనింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. దీంతో వారి అంచనాలు నియమయ్యి.. కొద్ది కొద్దిగా డబ్బులు రావడం మొదలు పెట్టాయి. దీంతో షాదాకుర్ , అనన్య లు తమ వ్యాపారాన్ని మరింతగా వృద్ది చేశారు. దీంతో ఇప్పుడు వీరిద్దరూ నెలకు దాదాపు 32 వేల డాలర్లు సంపాదిస్తున్నారు. అంతేకాదు డల్లాస్ లో ఓ డేటా సెంటర్ కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు తాము సంపాదిస్తున్న డబ్బులు తమ పై చదువుల కోసం ఉపయోగిస్తామని.. సమాజానికి ఉపగయోగపడే మంచి పనులు చేస్తామని చెప్పారు. నెలకు అక్షరాలా రూ.23 లక్షలు సంపాదిస్తున్న ఈ అన్నాచెల్లెలమీద మీడియా దృష్టి పడింది. ఇక అమెరికాలోనే కాదు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.