Job Seeker Visa: విదేశాల్లో ఉద్యోగం సాధించాలని ఎంతో మంది విద్యార్థులకు, ఉద్యోగులకు ఉండే సర్వసాధారణమైన కోరిక. అయితే స్వదేశంలో ఉండి విదేశాల్లో ఉద్యోగం కోసం వెతకడం అనేది దాదాపుగా అసాధ్యం. కుదిరితే విదేశాల్లో చదువుతూ ఉద్యోగం వెతకాలి.. లేదా విదేశీ కంపెనీలు మనం చదువుతున్న కాలేజీలకు వచ్చి క్యాంపస్ సెలక్షన్స్‌లో తీసుకోవాలి. ఇలాంటి మార్గాల్లో విద్యార్థులకే విదేశీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది తప్ప స్వదేశంలో ఏదో ఉద్యోగం చేస్తున్న వారికి కుదరని పని. ఈ క్రమంలో వారు విదేశీ ఉద్యోగం కావాలంటే.. ఆయా దేశాలకు వెళ్లాల్సిందే. అలా వెళ్దామా అంటే.. ఆఫర్ లెటర్ లేనిదే విసా ఇచ్చే దేశాలు కరువు. కానీ ప్రపంచంలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగే అన్ని దేశాలు ఉన్నాయి.. అవి మీకు ఎలాంటి ఆఫర్ లెటర్ లేకపోయినా జాబ్ సీకింగ్ వీసాని అందిస్తాయి. అంటే మీరు ఆయా దేశాల్లో ఉండి.. ప్రశాంతంగా ఉద్యోగాన్ని వెతుక్కొవచ్చు. అయితే ఆ దేశాలకు వెళ్లేందుకు వీసా కావాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అసలు జాబ్ సీకింగ్ వీసా అందిస్తున్న దేశాలు, వీసా కోసం కావాల్సిన అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
జెర్మనీ: ఉద్యోగం కోసం తమ దేశం రావాలనుకునే ఔత్సాహికులకు జెర్మనీ 6 నెలల జాబ్ సీకర్ వీసాను అందిస్తోంది. అయితే ఈ వీసా ద్వారా ఉద్యోగం వచ్చినవారు వెనువెంటనే జెర్మనీలో ఉండడానికి రెసిడెన్స్ పర్మిషన్ తీసుకోవాలి. జాబ్ సీకర్ వీసాతో జెర్మనీలో ఉద్యోగం చేసేందుకు ఆ దేశం అనుమతించదు. జెర్మనీ జాబ్ సీకింగ్ వీసా కోసం కనీసం 18 సంవత్సరాల వయసుతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే 5 సంవత్సరాల ఉద్యోగ అనుభవం, తమను తాము పోషించుకోగల స్థోమత(6284 డాలర్లు) లేదా తమను జెర్మనిలో పోషించే స్పాన్సర్‌ని కలిగి ఉండాలి. వీటితో పాటు కనీసం 12 నెలల వాలిడిటీ కలిగిన పాస్‌పోర్ట్, 3 పాస్‌పోర్ట్ ఫోటోలు, కెరీర్ ప్లాన్ గురించి కవర్ లెటర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, రెస్యూమ్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ లేదా స్పాన్సర్ లెటర్, ఆధార్ కార్డ్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండాలి. ఇంకా జాబ్ సీకర్ వీసా ధర 84 డాలర్ల వరకు అవుతుంది. వీసా వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం ఖర్చును మీరే భరించాలి.
యూకే: యూకే ప్రధాని రిషి సునక్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్’ ద్వారా యునైటెడ్ కింగ్‌డమ్‌కి ఉద్యోగం కోసం వెళ్లాలనకునేవారికి ఆఫర్ లెటర్ లేకుండానే వీసా వస్తుంది. ఈ వీసా కోసం అప్లై చేసుకునేవ భారతీయ వ్యక్తి వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం బ్యాచిలర్ డిగ్రీ, తనపై ఆధారపడిన పిల్లలు లేనివారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా వీసా కోసం పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్‌లో కనీసం 3267 డాలర్లు, టీబీ టెస్ట్ రిపోర్ట్స్, పోలీస్ వెరిఫికెషన్ సర్టిఫికేట్ వంటివి ఉండాలి. ఇంకా అప్లికేషన్ ఫీజ్ 340 డాలర్లు, హెల్త్‌కేర్ కోసం 1213 డాలర్ల ఖర్చును మీరే భరించాలి.
స్వీడన్: జాబ్ సీకర్స్ కోసం 2022లో స్వీడన్ కనీసం 3 నుంచి గరిష్ఠంగా 9 నెలల వీసాను అందిస్తోంది. ఈ వీసా ఉద్యోగం వెతకడానికి తప్ప, ఉద్యోగం చేయడానికి కాదని అప్లికేంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగం వచ్చినవారు వర్క్ పర్మిషన్ తీసుకుని చేసుకోవచ్చు. వీసా కోసం పీజీ డిగ్రీ లేదా పిహెచ్‌డీ, స్వయంపోషణ స్థోమత, పాస్‌పోర్ట్, బ్యాంక్ ఆకౌంట్‌లో కనీసం 1266 డాలర్లు ఉన్నట్లుగా ప్రూఫ్, డిగ్రీ సర్టిఫికేట్స్, హెల్త్ ఇన్య్సూరెన్స్, కెరీర్ ప్లానింగ్ లెటర్, ‘స్వీడన్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యూకేషన్’కి మీ కాలేజీ లేదా యూనివర్సిటీని సంప్రదించేందుకు పర్మిట్ లెటర్ ఇవ్వాలి. ఇంకా వీసా కోసం అయ్యే 213 డాలర్ల ఖర్చు భరించాలి.
ఆస్ట్రియా: ఆస్ట్రియా కూడా జాబ్ సీకర్స్ కోసం విసా అందిస్తుంది. ఇందుకోసం ఆస్ట్రియా 100 పాయింట్ల స్కేల్‌లో కనీసం 70 పాయింట్లు ఉండాలి. ఇంకా పాస్‌పోర్ట్, ఫోటోలు, ఆస్ట్రియాలో హస్టల్ లేదా షెల్టర్ వివరాలు, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండాలి. ఇంకా వీసా కోసం అయ్యే 168 డాలర్ల ఖర్చును మీరే భరించాలి.
పోర్చుగల్: పోర్చుగల్ కూడా ఉద్యోగం కోసం తమ దేశం వచ్చేవారికి 4 నెలల జాబ్ సీకర్ వీసాను అందిస్తోంది. ఈ సమయంలో వారు ఉద్యోగం పొందలేకపోవతే మరోసారి వీసా తీసుకోవచ్చు. ఇక ఈ వీసా కోసం పోర్చుగల్‌లో మీ బాధ్యత తీసుకునే ఆ దేశ సిటిజన్, పాస్‌పోర్ట్, ఫోటోలు, నేషనాలిటీ సర్టిఫికేట్, క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్, ట్రావెల్ ఇన్య్సూరెన్స్, ఆదాయ వివరాలు ఇవ్వాలి.
యూఏఈ: యూఏఈకి ఉద్యోగం కోసం వచ్చే భారతీయులకు ఆ దేశం 2,3,4 నెలల వీసాను అందిస్తోంది. దీని కోసం మీరు యూఏఈలో స్పాన్సర్‌ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇంకా అఈ వీసా కోసం యూఏఈ రూపొందించిన 500 యూనివర్సిటీల లిస్టులోని ఏదైనా వర్సిటీ నుంచి బాచిలర్ డిగ్రీతో పాటు ఫైనాన్సియల్ గ్యారంటీని చూపించాలి. ఇంకా ఫోటో, పాస్‌పోర్ట్, స్టడీ సర్టిఫికేట్స్ కూడా కలిగి ఉండాలి. వీటితో పాటు మీ వీసాని బట్టి రెండు నెలలకు 407 డాలర్లు, 3 నెలల వీసాకు 450 డాలర్లు, 4 నెలలకు 494 డాలర్ల ఆప్లికేషన్ ఫీజ్‌ని భరించాలి.