ఇండోనేషియాలోని అత్యంత జనసాంద్రత కలిగిన ద్వీపం జావాలో అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం పేలడంతో హై అలర్ట్ ప్రకటించారు. తూర్పు జావా ప్రావిన్స్‌లోని లుమాజాంగ్ జిల్లాలో ఉన్న సెమెరు పర్వతం చుట్టూ నివసించే ప్రజలను వేగంగా తరలిస్తున్నారు. భారీ పేలుడు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఇండోనేషియా విపత్తు పర్యవేక్షణ సంస్థ, BNPB, అగ్నిపర్వతం విస్ఫోటనం కేంద్రానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి కార్యకలాపాలు చేయవద్దని, లావా ప్రవహించే ప్రమాదం ఉన్నందున నది ఒడ్డుకు 500 మీటర్ల దూరంలో ఉండాలని స్థానికులను హెచ్చరించింది.
వందలాది మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించినట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి జోకో సంబాంగ్ తెలిపారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. సెమెరు చివరి పెద్ద విస్ఫోటనం గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగింది. ఆ తర్వాత సుమారు 50 మంది కాలిపోయారు. వారిని ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. అందులో ఓ వ్యక్తి మృతి చెందాడు.
Gunungapi Semeru kembali muntahkan Awan Panas Guguran (APG) pada hari Minggu (4/12) sejak pukul 02.46 WIB, dengan kolom abu teramati berwarna kelabu dengan intensitas sedang hingga tebal ke arah tenggara dan selatan setinggi kurang lebih 1.500 meter di atas puncak. #Semeru #APG pic.twitter.com/v3mtSR4ILW
— BNPB Indonesia (@BNPB_Indonesia) December 4, 2022
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, పరిసర ప్రాంతాల్లో గోధుమ బూడిద మేఘాలు కనిపిస్తున్నాయి. ఇండోనేషియా అధికారులు స్థానిక నివాసితులకు మాస్క్‌లను పంపిణీ చేశారు. అదే సమయంలో, ఈ పేలుడు తరువాత అక్కడ సునామీ వచ్చే అవకాశాన్ని పర్యవేక్షిస్తున్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK ఈ సమాచారాన్ని అందించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..