Pollution: అత్యంత కాలుష్య దేశాల నివేదికను ప్రకటించిన స్విట్జర్లాండ్ కి చెందిన సంస్థ, భారత్ ర్యాంక్ ఎంతంటే..
భారతదేశం కాలుష్య కొరల్లో చిక్కుంది. స్టిట్జర్లాండ్ కి చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ తన రిపోర్టులో మంగళవారం ప్రపంచదేశాల కాలుష్య ర్యాంకులను విడుదల చేసింది.

భారతదేశం కాలుష్య కొరల్లో చిక్కుంది. స్టిట్జర్లాండ్ కి చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ రిపోర్టులో ప్రపంచదేశాల కాలుష్య ర్యాంకులను మంగళవారం విడుదల చేసింది. 2022 ప్రకారం ప్రపంచలోనే భారత్ అత్యంత కాలుష్య దేశాల్లో 8వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 5వ స్థానంలో ఉండగా ఈసారి 8 వ స్థానానికి ఎగబాకింది. అయితే ఆ రిపోర్టులో ప్రపంచంలోని 50 నగరాలను అత్యంత కాలుష్య నగరాలను గుర్తించారు. ఇందులో దాదాపు 39 నగరాలు మన ఇండియాలోనే ఉండటం గమనార్హం. అత్యంత కాలుష్య దేశాల్లో టాప్ 10 ర్యాంకుల వారీగా , మధ్య ఆఫ్రికాకి చెందిన చాద్, ఇరాక్, పాకిస్థాన్, బెహరైన్, బంగ్లాదేశ్, బుర్కినా ఫాసో, కువైట్, ఇండియా, ఈజిప్టు, తజికిస్థాన్ లు నిలిచాయి. మరోవైపు ఆస్ట్రేలియా, ఎస్టోనియా, ఫిన్ లాండ్, గ్రెనడా, ఐస్లాండ్, న్యూజిలాండ్ దేశాలు అత్యంత పరిశుభ్రమైన దేశాలుగా నిలిచాయి.
అత్యంత కాలుష్య నగరాల్లో పాకిస్థాన్ లోని లాహోర్, చైనాలోని హోటన్ నగరాలు మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి. రాజస్థాన్ లోని భివాడి మూడో స్థానంలో, ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. టాప్ 10లో ఆరు భారతీయ నగరాలు, టాప్ 20లో 14 ఉండడం గమనార్హం. ఇలా మొత్తం టాప్ 50 కాలుష్య నగరాల్లో 39 మన ఇండియాకే చెందినవి కావడాన్ని చూస్తే మన దేశంలో కాలుష్యం ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
