UK: మినీ ఇండియాగా మారుతోన్న యూకే.. మూడేళ్లలో 273 శాతం పెరిగిన వీసాల సంఖ్య.. కారణాలేంటంటే..

బ్రిటన్‌లో భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత చదువు కోసం లండన్‌కు క్యూ కడుతున్నారు. బ్రిటన్‌లో విదేశీ విద్యార్థుల పరంగా భారతదేశం మొదటి స్థానంలో ఉంది. గత 3 సంవత్సరాలలో భారతీయ విద్యార్థులకు యునైటెడ్ కింగ్‌డమ్ మంజూరు చేసిన UK వీసాల సంఖ్య 273 శాతం పెరిగింది...

UK: మినీ ఇండియాగా మారుతోన్న యూకే.. మూడేళ్లలో 273 శాతం పెరిగిన వీసాల సంఖ్య.. కారణాలేంటంటే..
Uk
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2022 | 4:51 PM

బ్రిటన్‌లో భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత చదువు కోసం లండన్‌కు క్యూ కడుతున్నారు. బ్రిటన్‌లో విదేశీ విద్యార్థుల పరంగా భారతదేశం మొదటి స్థానంలో ఉంది. గత 3 సంవత్సరాలలో భారతీయ విద్యార్థులకు యునైటెడ్ కింగ్‌డమ్ మంజూరు చేసిన UK వీసాల సంఖ్య 273 శాతం పెరిగింది. ఈ గణాంకాలను UK హోమ్ ఆఫీస్ విడుదల చేసింది. యూకే వీసాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడంతో.. భారత్‌, చైనాను కూడా అధిగమించింది. బ్రిటన్ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) విడుదల చేసిన ఇమ్మిగ్రేషన్ డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది. యూకేలో భారతీయుల సంఖ్య పెరుగుతున్న తీరు చూస్తుంటే బ్రిటన్ మినీ ఇండియాగా మారుతోందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. భారతీయులు ఇంతలా యూకేకు ఎందుకు వెళుతున్నారు.? దీని వెనకాల అసలు కారణం ఏంటన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

UK హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం, సెప్టెంబర్ 2022 చివరి వరకు బ్రిటన్ భారతీయ విద్యార్థులకు 1,27,731 స్టడీ వీసాలను జారీ చేసింది. 2019లో భారతీయులు అందుకున్న UK స్టడీ వీసాల సంఖ్య 34,261 మాత్రమే. అంటే వీసాల జారీ ఏకంగా 273 శాతం పెరిగింది. ఇక చైనా విషయానికొస్తే.. భారత్ తర్వాత రెండో స్థానంలో ఉంది. కాగా ఈ విషయంలో ఇప్పటి వరకు చైనా నంబర్ 1 స్థానంలో ఉంది. సెప్టెంబర్ 2022 చివరి నాటికి, UK చైనా విద్యార్థులకు 1,16,476 స్టడీ వీసాలను మంజూరు చేసింది. 2019లో ఈ సంఖ్య 1,19,231. అంటే 2 శాతం తగ్గుదల నమోదైంది.ONSలో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డైరెక్టర్ జే లిండోప్ ప్రకారం, ‘జూన్ 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగాయి, ఇవి ఇతర దేశాల నుండి UKకి వలసలను ప్రోత్సహించాయి.’ యూకేకు వలసలు పెరగడానికి ప్రధాన కారణలు..

* కరోనా మహమ్మారి కేసులు అదుపులోకి వచ్చిన తర్వాత ప్రయాణ ఆంక్షలు ఎత్తివేశారు దీంతో.. పెద్ద సంఖ్యలో ప్రజలు బ్రిటన్‌కు వెళ్లడం ప్రారంభించారు. వీరిలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు UK విశ్వవిద్యాలయాలలో నమోదు చేసుకున్నవారు, అయితే ప్రయాణ నిషేధం కారణంగా ఆన్‌లైన్‌లో చదువుతున్నారు. వీరిలో భారతీయులే అధికం కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

* రష్యా, ఉక్రెయిన్‌లలో యుద్ధం ప్రారంభమైనప్పుడు, ప్రజలు భద్రతా కారణాల దృష్ట్యా చుట్టుపక్కల దేశాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి. అలాంటి పరిస్థితిలో, అక్కడ చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు కూడా బ్రిటన్ వచ్చారు. ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారనే విషయం తెలిసిందే.

* యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ విడిపోయిన తర్వాత (బ్రెక్జిట్‌) UKకి వలసలకు సంబంధించి నియమాలను సులభతరం చేశారు. అంతర్జాతీయ విద్యార్థులు UKలో చదువుకోవడానికి, పని చేయడానికి కొత్త గ్రాడ్యుయేట్ రూట్ వీసాలు ప్రవేశపెట్టారు. వీటిలో అత్యధికంగా 41 శాతం మంది భారతీయులకు వీసాలు ఇచ్చారు.

* మే 2022లో బ్రిటన్ ప్రత్యేక హై పొటెన్షియల్ ఇండివిజువల్ (HIP) వీసాను ప్రవేశపెట్టింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుంచి మెరిట్‌ కలిగిన గ్రాడ్యుయేట్‌లను ఆకర్షిస్తోంది. తద్వారా వారు UK వెళ్లి పని చేయవచ్చు. ఈ విభాగంలో కూడా భారతీయులకు 14 శాతం వీసాలు మంజూరు చేశారు. ONS డేటా ప్రకారం 2021లో యూకేకి వలస వచ్చిన వారి సంఖ్య 1.73 లక్షలు కాగా 2022 జూన్‌ నాటికి ఏకంగా 5.04 లక్షలకు పెరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..