AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesia: పెళ్లికి ముందు శృంగారమే కాదు.. సహజీవనమూ కుదరదు.. చట్టం తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు..

పెళ్లికి ముందే శృంగారం చేయడాన్ని నిషేధించిన ఇండోనేషియా.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి కాని యువతీయువకులు కలిసి జీవించే ( లివ్ ఇన్ రిలేషన్ ) నూ నిషేధిస్త చేసిన బిల్లును..

Indonesia: పెళ్లికి ముందు శృంగారమే కాదు.. సహజీవనమూ కుదరదు.. చట్టం తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు..
Live In Relationship
Ganesh Mudavath
|

Updated on: Dec 06, 2022 | 1:24 PM

Share

పెళ్లికి ముందే శృంగారం చేయడాన్ని నిషేధించిన ఇండోనేషియా.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి కాని యువతీయువకులు కలిసి జీవించే ( లివ్ ఇన్ రిలేషన్ ) నూ నిషేధిస్త చేసిన బిల్లును ఆమోదించేందుకు సిద్ధమైంది. దీంతో నిబంధనలు అతిక్రమించిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వ్యభిచారాన్ని నేరంగా పరిగణించడంతో పాటు, పెళ్లి కాని జంటలు కలిసి జీవించడాన్ని నిషేధిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొంది కార్యరూపం దాల్చితే పెను మార్పులు వస్తాయి. ఇవి స్వదేశంలో ఉన్న వారినే కాకుండా పర్యాటకులు, విదేశీయులకూ వర్తిస్తాయని వెల్లడించింది. సెప్టెంబరు 2019 లో కొత్త డ్రాఫ్ట్ కోడ్‌ను ఆమోదించడానికి చేసిన ప్రణాళికలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లడయ్యాయి. వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. అయితే.. ఇండోనేషియాలో వ్యభిచారాన్ని నిషేధించే కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని నగరం జకార్తాలోని పార్లమైంట్ ఎదుట ప్రజలు ఆందోళన చేశారు. పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని, ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండోనేషియా జనాభాలో ప్రధానంగా ముస్లింలు ఉన్నారు. హిందువులు, క్రైస్తవులు, ఇతర మతాలకు చెందిన ప్రజలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో రాజకీయాల్లో మతపరమైన సంప్రదాయవాదం పెరిగింది. దీంతో ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని నిరసనకారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

అయితే.. పెళ్లికి మందు శృంగారం చేయడం పలు దేశాల్లో నేరం. కొన్ని దేశాల్లో చట్ట ఆమోదం. సమాజంలోని పలు సంస్కృతుల్లో చాలా మందికి పెళ్లికి ముందే శృంగారం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధించేలా కొత్త చట్టం తీసుకురానున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..