Hope Spacecraft: ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు..శాస్త్ర సాంకేతి పరిజ్ఞానాభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నాయి. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన ‘హోప్’ శాటిలైట్ అంగారక గ్రహ కక్షలోకి ప్రవేశించింది. ఆ వెంటనే అంగాకరకుడి తొలి చిత్రాన్ని ఒడిసిపట్టింది. దాన్ని కాస్తా యూఏఈ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపించింది.
మార్స్‌పై ఉన్న భారీ అగ్ని పర్వతమైన ‘ఒలింపస్ మాన్స్’ను హోప్స్ తన కెమెరాలో బంధించిందని యూఏఈ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. అంగారక గ్రహ ఉపరితలానికి 24,700 కిలోమీటర్ల ఎత్తు నుంచి హోప్ ఈ చిత్రాన్ని తీసినట్లు ఆదేశ అధికార వర్గాలు తెలిపారు. హోప్ తీసిన తొలి ఫోటోలో అంగారకుడి ఉపరితంపై ఉన్న ‘ఒలింపస్ మాన్స్’ అగ్ని పర్వతం క్షుణ్ణంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆదేశాధికారులు ట్వీట్ చేశారు.
HH Sheikh Mohammed Tweet:
من ارتفاع ٢٥ ألف كم عن سطح الكوكب الأحمر .. أول صورة للمريخ بأول مسبار عربي في التاريخ
The first picture of Mars captured by the first-ever Arab probe in history, 25,000 km above the Red Planet’s surface pic.twitter.com/Qgh2Cn3JPF
— HH Sheikh Mohammed (@HHShkMohd) February 14, 2021
Also read:
Man Gifts Kidney To His Wife: భార్యకు కిడ్నీ ఇచ్చేసిన భర్త.. ప్రేమికుల రోజున ‘జీవితమే’ గిఫ్ట్!