థాయ్ రాజుకు నాలుగో పెళ్లి.. ఎవరితోనంటే..?
మూడు పెళ్లిళ్లు చేసుకొని.. వాటిని పెటాకులు చేసుకున్న థాయ్‌లాండ్ రాజు మళ్లీ పెళ్లి మీద మోజుపడ్డాడు. మహా వజిరలోంగ్ కార్న్ అనే ఈ రాజు తాజాగా తన పర్సనల్ సెక్యురిటీ గార్డ్ మీదే మనసు పారేసుకున్నాడు. ఆమె అసలు పేరును తనకు నచ్చినట్లు క్వీన్ సుతిదగా మార్చారు. ఈ విషయాన్ని వెల్లడించిన థాయ్ రాయల్ గెజిట్.. వారి పెళ్లి ఫొటోలను, వీడియోలను విడుదల చేసింది. దీంతో ఆ దేశ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాగా గతంలో వజిరలోంగ్‌కు […]

మూడు పెళ్లిళ్లు చేసుకొని.. వాటిని పెటాకులు చేసుకున్న థాయ్‌లాండ్ రాజు మళ్లీ పెళ్లి మీద మోజుపడ్డాడు. మహా వజిరలోంగ్ కార్న్ అనే ఈ రాజు తాజాగా తన పర్సనల్ సెక్యురిటీ గార్డ్ మీదే మనసు పారేసుకున్నాడు. ఆమె అసలు పేరును తనకు నచ్చినట్లు క్వీన్ సుతిదగా మార్చారు. ఈ విషయాన్ని వెల్లడించిన థాయ్ రాయల్ గెజిట్.. వారి పెళ్లి ఫొటోలను, వీడియోలను విడుదల చేసింది. దీంతో ఆ దేశ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
కాగా గతంలో వజిరలోంగ్‌కు మూడు వివాహాలు జరగగా.. ఏడుగురు సంతానం ఉన్నారు. మొదట పెళ్లాడిన ముగ్గురితోనూ ఆయన విడాకులు తీసుకున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. థాయ్ ఎయిర్‌వేస్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తోన్న సుతిదను వజిరలోంగ్ 2014లో తన బాడీగార్డుల్లో డిప్యూటీ కమాండెంట్‌గా నియమించుకున్నారు. అంతకుముందు ఓ విమానంలో ఆమెను చూసి మనసుపడ్డ వజిరలోంగ్.. ఇన్నాళ్లకు ఆమెను భార్యగా చేసుకున్నాడు.
