AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోర్టులో తనను తాను రివాల్వర్ తో కాల్చుకున్న థాయ్ జడ్జి

థాయిలాండ్ న్యాయ చరిత్రలోనే ఇది అసాధారణ ఘటన. అక్కడి న్యాయమూర్తి ఒకరు కిక్కిరిసిన కోర్టు హాలులోనే.. అందరూ చూస్తుండగానే తన ఛాతీపై హాండ్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. పైగా తన తీర్పు తాలూకు వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో లైవ్ గా ఇచ్చాడు. బాగా ధనికులు, పలుకుబడిగల వ్యక్తులకు మాత్రమే థాయ్ కోర్టులు అనుకూలంగా తీర్పులు ఇస్తాయని, చిన్నపాటి నేరాలకు పాల్పడిన సాధారణ వ్యక్తులకు మాత్రం కఠిన శిక్షలు విధిస్తాయని క్రిటిక్స్ తరచూ […]

కోర్టులో తనను తాను రివాల్వర్ తో కాల్చుకున్న థాయ్ జడ్జి
Pardhasaradhi Peri
|

Updated on: Oct 06, 2019 | 11:22 AM

Share

థాయిలాండ్ న్యాయ చరిత్రలోనే ఇది అసాధారణ ఘటన. అక్కడి న్యాయమూర్తి ఒకరు కిక్కిరిసిన కోర్టు హాలులోనే.. అందరూ చూస్తుండగానే తన ఛాతీపై హాండ్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. పైగా తన తీర్పు తాలూకు వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో లైవ్ గా ఇచ్చాడు. బాగా ధనికులు, పలుకుబడిగల వ్యక్తులకు మాత్రమే థాయ్ కోర్టులు అనుకూలంగా తీర్పులు ఇస్తాయని, చిన్నపాటి నేరాలకు పాల్పడిన సాధారణ వ్యక్తులకు మాత్రం కఠిన శిక్షలు విధిస్తాయని క్రిటిక్స్ తరచూ అంటుంటారు. అయితే ఇందుకు పూర్తి విరుధ్ధంగా వ్యవహరించాడు ఆ జడ్జి. ఆ న్యాయమూర్తి పేరు కనకోర్న్ పియాంచనా. దక్షిణ థాయ్ లోని యాలా కోర్టులో కొన్నేళ్లుగా న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఓ గన్ మర్డర్ కేసులో అయిదుగురు ముస్లిం నిందితులకు కేసుకు సంబంధించి తీర్పునిస్తూ ఆయన ఈ వింత చర్యకు పాల్పడ్డాడు. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉందన్నాడు. అంటూనే తన హ్యాండ్ గన్ బయటకు తీసి తన ఛాతీపై కాల్చుకున్నాడు. ‘

ఒకరిని శిక్షించే ముందు సరైన, నమ్మదగిన సాక్ష్యాధారాలు ఖఛ్చితంగా అవసరం. మీకు అనుమానాలుంటే మాత్రం నిర్దోషులను శిక్షించకండి ‘ అని ఇతర న్యాయమూర్తులను ఉద్దేశించి పేర్కొన్నాడు. ఈ అయిదుగురు అనుమానితులూ నేరానికి పాల్పడలేదని తాను అనడంలేదని, కానీ జుడిషియల్ ప్రాసెస్ లో పారదర్శకత, విశ్వసనీయత అవసరమని, నిర్దోషులను, తప్పు చేయనివారిని శిక్షించడం వారిని బలిపశువులను చేయడమేనని పియాంచనా వ్యాఖ్యానించాడు. థాయ్  మాజీ రాజు చిత్ర పఠం ముందు ఓ లీగల్ ప్రమాణం చేస్తూ ఈయన తన వ్యాఖ్యలను ఫేస్ బుక్ లో లైవ్ గా ప్రకటించుకున్నాడు. కోర్టు సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స చేసిన డాక్టర్లు ఆయనకు ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. బహుశా వ్యక్తిగత ఒత్తిడితోనే ఈ జడ్జి ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చునని, కానీ అసలు కారణం ఏమిటో తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. దక్షిణ థాయ్ లో వేర్వేరు తెగల ముస్లింల మధ్యకొంతకాలంగా విద్వేషాలు రగులుతున్నాయి. నేరస్థులు యథేఛ్చగా కాల్పులకు తెగబడుతున్నారు. నిజానికి ఈ జడ్జి వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన అయిదుగురు ముస్లిములూ నేరస్థులేనని తెలుస్తోంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వీరిని ఈ న్యాయమూర్తి నిస్సహాయ స్థితిలో నిర్దోషులుగా విడిచిపుచ్ఛక తప్పలేదు.

\