Hafeez Saeed: ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారికి 31ఏళ్ల జైలు శిక్ష.. సంచలన తీర్పునిచ్చిన పాకిస్థాన్ కోర్టు
2008 లో ముంబయిలో జరిగిన పేలుళ్ల సూత్రధారి, జమాత్ -ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పునిచ్చింది. ఉగ్రవాదులకు నిధుల మళ్లింపునకు సంబంధించిన రెండు కేసుల్లో ఈ మేరకు శిక్ష ఖరారు...
2008 లో ముంబయిలో జరిగిన పేలుళ్ల సూత్రధారి, జమాత్ -ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పునిచ్చింది. ఉగ్రవాదులకు నిధుల మళ్లింపునకు సంబంధించిన రెండు కేసుల్లో ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా హఫీజ్ ఆస్తులను స్తంభింపజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో హఫీజ్ సయీద్ నిర్మించిన మసీదు, మదర్సాను స్వాధీనం చేసుకునేందుకు పాక్ అధికారులు సమాయత్తమయ్యారు. ముంబయి పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటికీ పాక్ తిరస్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ న్యాయస్థానమే అతనికి శిక్ష విధించడం సంచలనంగా మారింది.
2008 నవంబర్ 26 రాత్రి పాకిస్థాన్ ముష్కరులు భారీ ఆయుధాలు, పేలుడు సామగ్రితో ముంబయి మహానగరంలో మారణహోమం సృష్టించారు. ఛత్రపతి శివాజీ టర్మినస్, లియోపోల్డ్ కేఫ్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, తాజ్ హోటల్, నారిమాన్ హౌజ్ యూదుల కమ్యూనిటీ సెంటర్, కామా హాస్పిటల్ సహా పలు చోట్ల 10 మంది ఉగ్రవాదులు బీభత్సం(Terrorists Attack) సృష్టించారు. కనిపించిన వారిని కనిపించినట్టు తుపాకులతో విచక్షణారహితంగా కాల్చేశారు. రైల్వే స్టేషన్, పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉండే హోటల్, మరెన్నో చోట్ల రక్తపుటేర్లు పారించారు. సుమారు 60 గంటల తర్వాత నగరం మళ్లీ బలగాల అదుపులోకి వచ్చింది. ఈ ఊచకోతలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 300 మందికి పైగా గాయాలపాలయ్యారు.
Also Read
Income Tax: కేంద్ర ప్రభుత్వ అంచనాలను మించిన పన్ను వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా..
Viral Photo: ఎల్లోరా శిల్పం.. అందాల నయాగారం.. ఓర చూపులు చూస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా!