విమానం ఎక్కాలంటే మగ తోడు తప్పనిసరి.. మహిళల ప్రయాణంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు

|

Mar 27, 2022 | 11:55 AM

తాము అధికారంలోకి వస్తే మహిళలపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని తాలిబన్లు(Taliban) చేసిన ప్రకటనలు నీటిమూటగా మారింది. తాజాగా మధ్య యుగాల నాటి నియమాన్ని పాటించాల్సిందేనని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు మగతోడు..

విమానం ఎక్కాలంటే మగ తోడు తప్పనిసరి.. మహిళల ప్రయాణంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు
Flight Journey
Follow us on

తాము అధికారంలోకి వస్తే మహిళలపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని తాలిబన్లు(Taliban) చేసిన ప్రకటనలు నీటిమూటగా మారింది. తాజాగా మధ్య యుగాల నాటి నియమాన్ని పాటించాల్సిందేనని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు మగతోడు లేకుండా విమానాల్లో ప్రయాణించకూడదని అఫ్గాన్ (Afghanistan) ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ముందే టికెట్లు బుక్‌ చేసుకొని కూడా అఫ్గాన్‌ స్త్రీలు విమానం ఎక్కలేకపోయారు. పాకిస్థాన్, దుబాయ్, టర్కీ దేశాలకు వెళ్లడానికి కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన అనేకమంది మహిళలను తాలిబన్‌ ప్రభుత్వ ఆదేశాల వల్ల విమానాలు(Flights) ఎక్కనివ్వలేదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. పురుషుల తోడు లేకుండా వారు విమాన ప్రయాణాలు చేయకూడదని స్పష్టం చేసింది. కొంత సేపటి తర్వాత కొందరు మహిళలు ఒంటరిగా హెరాత్‌ వెళ్లే విమానం ఎక్కడానికి తాలిబన్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఆ విమానం ఆలస్యంగా రావడంతో వారు ఎక్కకముందే అది ఎగిరిపోయింది. ఏ మహిళ అయినా 72 కిలోమీటర్ల దూరానికి మించి ప్రయాణించాలంటే మగతోడు తప్పనిసరి అని తాలిబన్‌ సర్కారు కొంతకాలం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలోనూ బాలికలను ఆరో తరగతి తరవాత హైస్కూళ్లకు పంపకూడదనే నిషేధాన్ని ఎత్తివేస్తామని చేసిన వాగ్దానాన్ని సైతం తాలిబన్‌ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇప్పుడు కొత్తగా విమానాల్లోకీ అనుమతించేది లేదంటోంది. వీరి నిర్వాకాలు అంతర్జాతీయ సమాజానికే కాదు. స్థానికులకూ ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బాలికలను హైస్కూళ్లకు వెళ్లనివ్వాలని కోరుతూ కాబుల్‌లో ప్రదర్శనలు జరిగాయి. వీటిలో బాలికలే ఎక్కువగా పాల్గొన్నారు. అఫ్గానిస్థాన్‌ నిరుపేద దేశమనీ అక్కడి ప్రజలకు విజ్ఞానం అందకుండా చేస్తే వారి భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచదవండి.

Watch Video: డీజే బ్రావో స్టైలే వేరు.. వికెట్ తీస్తే మైదానంలో తీన్మారే.. వైరల్ వీడియో

Viral Video: భారత స్పైడర్ మ్యాన్.. రోడ్డుమీద బురద నీటి దాటిన తీరు అద్భుతం.. వీడియో వైరల్

Viral Video: కచ్చ బాదం డ్యాన్స్‌ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!