అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు(Talibans) పాలన చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే తమ దేశంలోని మహిళలకు చదువు, దుస్తులు వంటి అనేక విషయాలపై రకరకాల ఆంక్షలు విధించిన తాలిబన్లు.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన తాలిబన్ల హామీలు నీటిమూటగా మారాయి. తాజాగా టీవీ యాంకర్లపైనా తాలిబన్లు ఆంక్షలు విధించారు. వార్తల ప్రసార సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలకు ఎదురుచెప్పే పరిస్థితి కానీ, వాటిపై బహిరంగంగా చర్చించే పరిస్థితి గానీ లేదని అఫ్గాన్‌కు చెందిన ఒక వార్తా సంస్థ అభిప్రాయపడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహిళా యాంకర్లు ముఖాలకు మాస్కులు ధరించి ప్రసారాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు యాంకర్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
గతంలోనూ తాలిబన్లు ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అఫ్గాన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. గతేడాది ఆగస్టులో అఫ్గాన్ ప్రభుత్వం పతనమై తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్థాన్ లో మానవ హక్కుల పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో పోరాటాలు ముగిసినప్పటికీ, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.
The #Taliban in a new order have ordered all female journalists & TV presenters in AFG to wear masks and cover their faces.
Yalda Ali, host of @TOLO_TV famous morning show ‘Bamdad Khosh’ in response to TBN new order wrote on her IG: this is me, the woman who is being eliminated. pic.twitter.com/E9x1zJaDA8
— Natiq Malikzada (@natiqmalikzada) May 18, 2022
గతంలోనూ బాలికలను ఆరో తరగతి తరవాత హైస్కూళ్లకు పంపకూడదనే నిషేధాన్ని ఎత్తివేస్తామని చేసిన వాగ్దానాన్ని సైతం తాలిబన్ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇప్పుడు కొత్తగా విమానాల్లోకీ అనుమతించేది లేదంటోంది. వీరి నిర్వాకాలు అంతర్జాతీయ సమాజానికే కాదు. స్థానికులకూ ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బాలికలను హైస్కూళ్లకు వెళ్లనివ్వాలని కోరుతూ కాబుల్‌లో ప్రదర్శనలు జరిగాయి. వీటిలో బాలికలే ఎక్కువగా పాల్గొన్నారు. అఫ్గానిస్థాన్ నిరుపేద దేశమనీ అక్కడి ప్రజలకు విజ్ఞానం అందకుండా చేస్తే వారి భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
The Taliban have ordered Afghan women TV presenters to cover their faces. Yalda Ali is the host of Tolo TV and has published this video. let’s be her voice!! pic.twitter.com/XA4BXwToSr
— marzieh hamidi (@MarziehHamidi) May 19, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read
Mahesh Babu: మనసులోని మాటలను బయటపెట్టిన మహేష్ బాబు.. ఆ సినిమాను రీక్రియేట్ చేయాలనుందంటూ..
Cash Withdrawal: గూగుల్ పే, పేటీఎంతో ఏటీఎమ్ నుంచి మనీ విత్ డ్రా.. పూర్తి ప్రాసెస్ తెలుసుకోండి..!