Talibans: ఒక్కసారిగా భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన తాలిబన్లు.. విషయం ఏంటంటే..?

|

Jun 25, 2022 | 1:36 PM

ఏళ్లుగా పాకిస్తాన్(Pakisthan) తో అంటకాగుతున్న తాలిబన్లు ఒక్కసారిగా భారత్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. మీరు చదివింది నిజమే.. ఇంతకీ తాలిబన్లు భారత్ ను ఎందుకు ప్రశంసించారో తెలుసుకోండి. పెను భూకంపంతో అల్లాడిన అఫ్గానిస్థాన్...

Talibans: ఒక్కసారిగా భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన తాలిబన్లు.. విషయం ఏంటంటే..?
Afghanistan
Follow us on

ఏళ్లుగా పాకిస్తాన్(Pakisthan) తో అంటకాగుతున్న తాలిబన్లు ఒక్కసారిగా భారత్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. మీరు చదివింది నిజమే.. ఇంతకీ తాలిబన్లు భారత్ ను ఎందుకు ప్రశంసించారో తెలుసుకోండి. పెను భూకంపంతో అల్లాడిన అఫ్గానిస్థాన్ (Afghanistan)ను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. సహాయక సామగ్రితో పాటు సాంకేతిక బృందాన్ని అఫ్గాన్ రాజధాని కాబూల్ కు పంపింది. భారత్ అందిస్తున్న సహాయానికి ఆ దేశంలోని తాలిబన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. కాబూల్‌లోని రాయబార కార్యాలయానికి భారతదేశానికి చెందిన టెక్నికల్ టీమ్ ను పంపించడాన్ని తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్ కహర్ బాల్కీ ప్రశంసించారు. భారత దౌత్యవేత్తలు తమ దేశానికి రావడం, రాయబార కార్యాలయ సేవలను ప్రారంభించడం వల్ల దేశంలో భద్రత ఏర్పడిందని అన్నారు. అంతర్జాతీయ దౌత్య పద్ధతులకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న అన్ని రాయబార కార్యాలయాల భద్రతకు తాలిబన్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అఫ్గాన్ కు సహాయం అందించేందుకు ఇటీవల భారతీయ బృందం కాబూల్‌ను సందర్శించింది. తాలిబన్ సీనియర్ సభ్యులతో సమావేశమైంది. ఈ పర్యటనలో శాంతిభద్రతల పరిస్థితిని కూడా సమీక్షించారు.

తీవ్ర భూకంపంతో కకావికలమైన అఫ్గానిస్థాన్ కు సహాయం అందించేందుకు భారత్ ముందడుగు వేసింది. అఫ్గాన్ కు అవసరమైన పరికరాలు, ఇతర సహాయ సామగ్రిని అధికారులు కాబూల్‌కు(Earthquake in Afghanistan) తరలించారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భూకంపంలో దెబ్బతిన్న అఫ్గాన్‌కు సహాయం అందించిన మొదటి దేశం భారత్ కావడం విశేషం. సహాయ సామగ్రితో పాటు ఓ సాంకేతిక బృందాన్ని కూడా అఫ్గాన్ కు పంపించారు. భారత్‌ నుంచి వెళ్లిన బృందంలోని సభ్యులు తాలిబన్లతో కలిసి మనవతా సాయం పంపిణీని పర్యవేక్షించనున్నారు. భారత దౌత్య బృంద భద్రతకు తాలిబన్లు చాలా సార్లు హామీలు ఇచ్చాక ఈ టెక్నికల్‌ టీమ్‌ పంపించడం గమనార్హం.

ఆఫ్గనిస్తాన్‌లో సంభవించిన భూకంపం పెనువిషాదాన్ని నింపుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 950మందికి పైగా మృతి చెందారు. 600 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని హెలికాఫ్టర్ల ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. భూప్రకంపనల ధాటికి వందలాది భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకొని వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. రాత్రిపూట అందరూ నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించడంతో ప్రాణ నష్టం భారీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..