Taliban: ప్రభుత్వ ఉద్యోగాల్లో మీ కుటుంబ సభ్యులను తొలిగించండి.. తాలిబాన్ చీఫ్ అఖుంద్జాదా సంచలన నిర్ణయం..

ఆఫ్ఘనిస్తాన్‌ పాలనపై ఫోకస్ పెట్టారు తాలిబన్లు. ప్రపచం వ్యాప్తంగా వస్తున్న ఒత్తాడి నుంచి బయట పడేందుకు చాలా మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా తాలిబన్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. వారు తీసుకున్న డిక్రీపై చర్చ మొదలైంది.

Taliban: ప్రభుత్వ ఉద్యోగాల్లో మీ కుటుంబ సభ్యులను తొలిగించండి..  తాలిబాన్ చీఫ్ అఖుంద్జాదా సంచలన నిర్ణయం..
Taliban Leaders
Follow us

|

Updated on: Mar 21, 2023 | 9:44 AM

కుటుంబ పాలనపై మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మన దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లో కుటుంబ పాలనపై రాజకీయ చర్చ జరుగుతోంది. కుటుంబ పాలన వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో తాలిబన్లు తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణంగా మారింది. అయితే వారు తీసుకునే నిర్ణయాలు మన నేతలను తలదించుకునేలా చేస్తున్నాయి. ప్రజలకు మంచి పాలన అందించాలంటే ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా ఉండాలంటున్నారు తాలిబన్లు. తమ కొడుకులు, బంధువులను ప్రభుత్వ పదవుల్లో నియమిస్తే వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.తాలిబన్లు తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది.

అంతే కాదు వారికి పాలనపై ఉన్న పట్టుదల గురించి అర్థం అవుతోంది. కాబూల్. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ నాయకుడు ఆఫ్ఘన్ అధికారులకు తాజాగా ఈ ఉత్తర్వు జారీ చేసారు. కుమారులు, బంధువులను ప్రభుత్వ అధికారుల పదవి నుంచి వెంటనే తొలగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. అధికారులు వారి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులను ప్రభుత్వ పదవుల నుంచి తొలగించాలని హిబతుల్లా అఖుంద్జాదా డిక్రీ పేర్కొంది. భవిష్యత్తులో వారు తమ బంధువులను నియమించుకోకుండా ఉండాలిని సూచించారు.

2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత.. తాలిబాన్ కొంతమంది ప్రభుత్వ అధికారులను తొలగించింది. కాగా కొందరు అధికారులు పారిపోయారు. ఇదిలా ఉండగా, వ్యక్తిగత కనెక్షన్ల ఆధారంగా, అనుభవం లేని సిబ్బందిని ప్రభుత్వ పోస్టుల్లో నియమించారని తాలిబాన్ ప్రభుత్వం అనేకసార్లు ఆరోపించింది. పాకిస్తాన్‌లోని పెషావర్ నుంచి ప్రచురించబడిన ఆఫ్ఘన్ ఇస్లామిక్ ప్రెస్ నివేదిక ప్రకారం, చాలా మంది సీనియర్ తాలిబాన్ అధికారులు తమ కుమారులను అనేక ఉన్నత స్థానాల్లో నియమించుకున్నారనే ఆరోపణల ఆధారంగా ఈ డిక్రీ తీసుకోబడింది.

డిక్రీ ఫోటోను శనివారం అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ కార్యాలయం ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. కాబూల్‌పై తాలిబాన్ నియంత్రణను తిరిగి పొందిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సంక్షోభం, మానవతా సంక్షోభంతో పోరాడుతూనే ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా దేశంలో విదేశీ దళాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ సమయంలో వేలాది తాలిబాన్లు చంపబడ్డారు. అనేక మంది అక్కడి నుంచి మార్చారు.

తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దేశ సెంట్రల్ బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేయబడింది. దేశానికి విదేశీ నిధులన్నీ నిలిపివేయబడ్డాయి. దీని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సహజ వాయువు, రాగి, అనేక అరుదైన ఖనిజాలు ఉన్న సహజ వనరులు ఉన్నాయి. కానీ గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న కుంభకోణాల కారణంగా ఈ నిల్వలను వినియోగించుకోలేకపోయారు. ఈ నిల్వల ధర 1 ట్రిలియన్ డాలర్లు ఉండి ఉండొచ్చని అంచనావేస్తున్నారు.

మహిళల హక్కుల పట్ల తాలిబాన్ ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రపంచ స్థాయిలో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది. అలాగే చాలా దేశాల తమ మద్దతు కూడా నిలిపివేశాయి. దీని కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత ఇప్పటికీ మహిళలు చదువుకోవడానికి అనుమతి లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం