‘మా వ్యాక్సిన్ తీసుకోండి, వీసాలిస్తాం’, చైనా కొత్త ప్రకటన, ‘ తాయిలం’ ఫలించేనా ? ఇండియాతో పోటీయా ?

| Edited By: Phani CH

Mar 16, 2021 | 3:46 PM

తమ దేశంలో ఉత్పత్తి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ని తీసుకోగోరేవారికి , తీసుకున్న విదేశీయులకు వీసాలను మంజూరు చేస్తామని చైనా ప్రకటించింది...

మా వ్యాక్సిన్ తీసుకోండి, వీసాలిస్తాం, చైనా కొత్త ప్రకటన,   తాయిలం ఫలించేనా ?  ఇండియాతో పోటీయా ?
Corona Vaccine
Follow us on

తమ దేశంలో ఉత్పత్తి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ని తీసుకోగోరేవారికి , తీసుకున్న విదేశీయులకు వీసాలను మంజూరు చేస్తామని చైనా ప్రకటించింది. అమెరికా, ఇండియా,  పాకిస్తాన్ సహా కొన్ని  దేశాల వారిని అనుమతించేందుకు  సరిహద్దు ఆంక్షలను కాస్త సడలిస్తామని  యూఎస్ లోని చైనా ఎంబసీ వెల్లడించింది.  కోవిడ్ వ్యాప్తిని నివారించేందుకు ఈ దేశం గత ఏడాది మార్చి నుంచి తమ దేశంలోకి విదేశీయుల రాకను నియంత్రిస్తోంది.  అయితే ఇప్పుడు చాలావరకు కరోనా వైరస్ ని కట్టడి చేయగలిగింది.  మా వ్యాక్సిన్లను తీసుకున్న  విదేశియులను ఎంపిక చేసుకునేందుకు వీసా దరఖాస్తులను ఇచ్చే ప్రక్రియ  ప్రారంభిస్తామంటూ పలు దేశాల్లోని చైనా ఎంబసీలు నోటీసులు ఇచ్చాయి. మా దేశంలో మళ్ళీ తమ పనులు చేపట్టేవారికి, వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేవారికి , లేదా మా దేశంలో ఉన్న మీ కుటుంబాలను కలుసుకోగోరేవారికి   ఈ వారం  నుంచి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ముఖ్యంగా అమెరికాలోని చైనీస్ రాయబార కార్యాలయం వెల్లడించింది. చైనాలో ఇప్పటివరకు నాలుగు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కోసం అందుబాటులోకి తెచ్చారు.  వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి 14 రోజులముందు వీరు కనీసం ఒక డోసు లేదా రెండు డోసులు తీసుకుని ఉండాలని  చైనా అధికారులు స్పష్టం చేశారు.

రెండు వారాల క్రితం ఫిలిప్పీన్న్ చైనా నుంచి 6 లక్షల డోసుల వాక్సిన్ అందుకుంది. అయితే ఇండియా, శ్రీలంక తదితర కొన్ని దేశాల్లో చైనా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. ఇప్పుడు తమ టీకామందులను విస్తృతం చేసేందుకు చైనా  ఇలా వీసాలకు, వ్యాక్సిన్లకు ముడిపెట్టింది. కానీ చైనా టీకామందులపై ఇంకా పలు దేశాలు సందేహాలను వ్యక్తం చేయడంతో ఈ దేశం ఇంకా మల్లగుల్లాలు పడుతోంది . తమ వ్యాక్సిన్ టెస్ట్ ఫలితాలపై అనేక దేశాలు నమ్మడం లేదని బీజింగ్ భావిస్తోంది. అయితే వాటిని ప్రచారం చేసుకుంటే ఈ బెడద ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి: మూడో టీ20: టీమిండియాలో కీలక మార్పు.. తుది జట్టులోకి రోహిత్ శర్మ.. ఆ స్టార్ ప్లేయర్‎పై వేటు.!

Sandstorm in China : చైనా రాజధాని బీజింగ్ ను ముంచెత్తిన ఇసుక తుఫాన్.. శ్వాసకోశ వ్యాధులున్నవారికి ప్రభుత్వం హెచ్చరిక