Afghanistan Blast: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి మారణహోమం.. ఆరుగురు మృతి… పలువురికి గాయాలు..

|

Mar 28, 2023 | 6:37 AM

 ఆఫ్ఘన్‌లో మళ్లీ మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. ఆత్మాహుతి దాడితో ఆరుగుర్ని పొట్టనబెట్టుకున్నారు. ఆఫ్ఘన్ విదేశాంగ కార్యాలయం దగ్గర జరిగిన ఈ సూసైడ్‌ ఎటాక్‌తో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.  

Afghanistan Blast: కాబూల్‌లో ఆత్మాహుతి దాడి మారణహోమం.. ఆరుగురు మృతి... పలువురికి గాయాలు..
Kabul Bomb Blast
Follow us on

ఆఫ్ఘన్‌లో మరోసారి బాంబుల మోత మోగింది. కాబూల్‌లో మారణహోమం సృష్టించారు సూసైబ్‌ బాంబర్‌. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సమీపంలో జరిగిన పేలుళ్లలో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు పేలుళ్లలో ముగ్గురు ఆఫ్ఘన్‌ భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు ప్రకటించింది ఆఫ్ఘన్ ప్రభుత్వం. ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ కార్యాలయం ముందున్న ఒక వ్యాపార కేంద్రంలో ఈ పేలుడు జరిగింది. మాలిక్‌ అస్గర్‌ స్క్వేర్‌ దగ్గర తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఓ వ్యక్తిని గుర్తించాయి భద్రతా దళాలు. అతడిని పట్టుకునేలోపే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. బాంబులతో తనను తానే పేల్చేసుకున్నాడు. దాంతో, స్పాట్‌లో ఆరుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

సూసైడ్‌ బాంబర్‌ బ్లాస్ట్‌తో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సమీపంలో ఆత్మాహుతి ఎటాక్‌ జరగడం ఇది రెండోసారి, అది కూడా మూడు నెలల్లో సెకండ్‌ టైమ్‌ దాడి జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇక, ఈ బ్లాస్ట్‌లో మరణించిన ఆరుగురు కూడా పౌరులే. మరో 12మంది పౌరులు, ముగ్గురు భద్రతాసిబ్బంది గాయపడటంతో వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆత్మాహుతి దాడికి ఎవరు బాధ్యులన్నది తేలలేదు. ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే బాధ్యులని ప్రకటించుకోలేదు. అయితే ఐఎస్‌ఐఎస్‌ పనిగా అనుమానిస్తోంది ఆఫ్ఘన్ ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..