Indonesia: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. చల్లని లావా కారణంగా 37 మంది మృతి

|

May 12, 2024 | 9:41 PM

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అగ్నిపర్వత వాలుల నుండి చల్లని లావా, బురద ప్రవహించడం వల్ల విధ్వంసం సృష్టించింది. దీంతో దీవిలో ఒక్కసారిగా వరదలు వచ్చాయి. పిల్లలతో సహా కనీసం 37 మంది మరణించారు. డజనుకు పైగా జనం గల్లంతయ్యారు.

Indonesia: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. చల్లని లావా కారణంగా 37 మంది మృతి
Indonesia Floods
Follow us on

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అగ్నిపర్వత వాలుల నుండి చల్లని లావా, బురద ప్రవహించడం వల్ల విధ్వంసం సృష్టించింది. దీంతో దీవిలో ఒక్కసారిగా వరదలు వచ్చాయి. పిల్లలతో సహా కనీసం 37 మంది మరణించారు. డజనుకు పైగా జనం గల్లంతయ్యారు. మరాపి పర్వతంపై రుతుపవన వర్షాలు, చల్లబడిన లావా కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం అర్ధరాత్రి దాటకముందే ఓ నది ఉగ్రరూపం దాల్చింది. ఇది పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లోని పర్వత గ్రామాలను విధ్వంసం చేసింది. ప్రజలు కొట్టుకుపోయారని, 100కు పైగా ఇళ్లు, భవనాలు వరదలో మునిగిపోయాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహ్రీ తెలిపారు.

చల్లబడిన లావాను వేవ్ అని కూడా అంటారు. ఇది అగ్నిపర్వత పదార్థం, గులకరాళ్ళ మిశ్రమం. వర్షాల సమయంలో అగ్నిపర్వతం వాలుల నుండి ప్రవహిస్తుంది. దీంతో నష్టం భారీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఆదివారం మధ్యాహ్నం నాటికి, రెస్క్యూ వర్కర్లు అగామ్ జిల్లాలోని కండువాంగ్ గ్రామం నుండి 19 మృతదేహాలను, పొరుగున ఉన్న జిల్లా తనహ్ దాతర్‌లో మరో తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. పదాంగ్ పరిమాన్‌లో ఘోరమైన వరదల సమయంలో ఎనిమిది మృతదేహాలను బురద నుండి బయటకు తీయగా, పదాంగ్ పంజాంగ్ పట్టణంలో ఒక మృతదేహాన్ని కనుగొన్నట్లు ప్రకటన తెలిపింది. 18 మంది గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది వెతుకుతున్నారు అధికారులు.

శనివారం రాత్రి ఆకస్మిక వరదల కారణంగా, తనహ్ దాతర్ జిల్లాలోని అనై వ్యాలీ జలపాతం ప్రాంతం చుట్టూ ఉన్న ప్రధాన రహదారులు కూడా బురదతో మూసుకుపోయాయి. ఇతర పట్టణాలకు రాకుండా అడ్డుకున్నాయని పదాంగ్ పంజాంగ్ పోలీసు చీఫ్ కర్తయానా పుత్ర ఆదివారం తెలిపారు. విడుదల చేసిన వీడియోలో, మురికి గోధుమ నదులుగా మారిన రోడ్లు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పశ్చిమ సుమత్రాలోని పెసిసిర్ సెలాటాన్ మరియు పడాంగ్ పరిమాన్ జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం జరిగిన రెండు నెలల తర్వాత ఈ విపత్తు సంభవించింది. కనీసం 21 మంది మరణించారు. ఐదుగురు అదృశ్యమయ్యారు.

గత ఏడాది చివర్లో 2,885 మీటర్ల మరాపి పర్వతంలో పేలుడు సంభవించింది. అందులో 23 మంది పర్వతారోహకులు మరణించారు. ఇండోనేషియా అగ్నిపర్వత, భూగర్భ విపత్తుల కేంద్రం ప్రకారం, అగ్నిపర్వతం 2011 నుండి నాలుగు హెచ్చరిక స్థాయిలలో మూడవ అత్యధిక స్థాయిలో ఉంది. జనవరి 2023లో విస్ఫోటనం జరిగినప్పటి నుండి మరాపి చురుకుగా ఉంది. ఇండోనేషియాలోని 120 కంటే ఎక్కువ క్రియాశీల అగ్నిపర్వతాలలో ఇది ఒకటి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…