Earthquake: వణికిన అమెరికా.. వాషింగ్టన్‌లో భూ ప్రకంపనలు.. సునామీ వచ్చే అవకాశం..
వాషింగ్టన్‌లోని సియాటిల్‌లో సోమవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది. పసిఫిక్ నార్త్‌వెస్ట్ సీస్మిక్ నెట్‌వర్క్ ప్రకారం.. రాత్రి 7:21 గంటలకు మారోస్టోన్ ద్వీపం కింద భూకంప కేంద్రంగా గుర్తించారు. వాషింగ్టన్‌లోని సియాటిల్‌లో సునామీ వచ్చే అవకాశం లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

అమెరికా కంపించింది. వాషింగ్టన్ – పశ్చిమ వాషింగ్టన్‌లో ఆదివారం సాయంత్రం 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. పసిఫిక్ నార్త్‌వెస్ట్ సీస్మిక్ నెట్‌వర్క్ ప్రకారం.. రాత్రి 7:21 గంటలకు మారోస్టోన్ ద్వీపం కింద భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం 57 కిలోమీటర్ల లోతులో వచ్చి ఉంటుందని తెలిపింది. భూకంపం సీటెల్‌కు వాయువ్యంగా ఉన్న పుగెట్ సౌండ్ రీజియన్‌లో.. పోర్ట్ టౌన్‌సెండ్‌కు దక్షిణంగా వాషింగ్టన్‌లోని మారోస్టోన్‌కు దక్షిణంగా 2.5 మైళ్ల దూరంలో ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
We have detected an earthquake of preliminary magnitude 4.3, depth of 57 km, and epicenter located under Marrowstone Island. We know it was widely felt around the Puget Sound – many of us at PNSN felt it ourselves. https://t.co/QYRSbxusyS pic.twitter.com/ypl8emTw59
— PNSN (@PNSN1) October 9, 2023
వాషింగ్టన్‌లోని సియాటిల్‌లో సునామీ వచ్చే అవకాశం లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రిపోర్టింగ్ సమయంలో భూకంప ప్రభావం పూర్తి స్థాయిని పూర్తిగా అంచనా వేయనప్పటికీ.. తదుపరి సునామీ గురించి ఎటువంటి అంచనా లేదని అధికారులు చెప్పడం ద్వారా భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతం తీరప్రాంతం ఎక్కువగా ఉండటంతో సునామీ ఉంటుందనే అంచనాలు తప్పు అని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
Tsunami NOT expected; Tsunami Information Statement: M4.1 035mi NW Seattle, Washington 1921PDT Oct 8.
— NWS Tsunami Alerts (@NWS_NTWC) October 9, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి