వైద్యరంగంలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఒక 29 ఏళ్ల యువకుడి శరీరం క్రమంగా రాయిలా మారుతోంది. ఇది డాక్టర్లు సైతం షాకయ్యే వింత వ్యాధి. న్యూయార్క్‌లో ఇలాంటి భయానక కేసు నమోదైంది. జో సూచ్ అనే యువకుడి శరీరం క్రమంగా రాయిగా మారుతోంది. ఇది ఫైబ్రోడిస్ప్లాసియా ఒస్సిఫికన్స్ ప్రోగ్రెస్సివా (FOP) అని పిలువబడే సిండ్రోమ్ వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి నడవటం సాధ్యం కాదు. వైద్యులు దీనిని జన్యుపరమైన వ్యాధి అంటారు. కానీ ఇది చాలా అరుదు అని చెబుతున్నారు. 2 మిలియన్ల మందిలో ఒకరిని ఈ వ్యాధి ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమైనది అంటే.. ప్రపంచంలో కేవలం 800 మంది మాత్రమే ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని జో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అనారోగ్య పరిస్థితిని పంచుకున్నాడు.
ఇక ఈ వింత వ్యాధికి ఇప్పటి వరకు సరైన మెడిసిన్ కనుగొనబడలేదు. తన ఎముకలు పెరిగిన ప్రతిసారీ తన శరీరంలోకి కత్తి పెట్టినట్లుగా భావిస్తానని జో సుచ్ చెప్పాడు. స్టోన్ మ్యాన్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైన రుగ్మత. దీనిలో కండరాలు, స్నాయువులు క్రమంగా ఎముకలుగా మారుతాయి. ఇది బాధిత వ్యక్తికి నడవడం కష్టతరం చేస్తుంది. ఈ సిండ్రోమ్ సులభంగా గుర్తించబడుతుంది. కానీ సామాన్యులకు ఈ సమస్య గురించి తెలియదు. కాబట్టి ఎవరూ సీరియస్‌గా తీసుకోరు.
నవజాత శిశువుల్లో ఈ వ్యాధి తొలుత కాలి, బొటనవేళ్ల సున్నితత్వాన్ని చూడటం ద్వారా లక్షణాలను తెలుసుకోవచ్చు. అలాగే, పిల్లవాడు పెద్దయ్యాక, లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఈ వ్యాధిలో కణజాలం నెమ్మదిగా ముక్కు, వీపు, తుంటి, అవయవాలను కవర్ చేస్తుంది. ఆ వ్యక్తి పూర్తిగా నడవలేని స్థితికి వెళ్లే వరకు ఇది కొనసాగుతుంది. ఎముకల పెరుగుదలను మందగించే కొన్ని మందులను వైద్య శాస్త్రం కనుగొంది. కానీ, ఇది పూర్తిగా ప్రభావవంతంగా ఉందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ కొనసాగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..