The Stanley Hotel: దేవుళ్ళు, దెయ్యాలు ఉన్నాయా అనే విషయం పై ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు విభిన్న వాదనలు.. ఐతే కొందరు దెయ్యాలు ఉన్నాయంటే.. దేవుళ్లు ఉన్నట్లేగా అంటారు.. అయితే దెయ్యాలు ఉన్నాయంటూ కొన్నిసంఘటనలు రుజువు చేస్తున్నాయి. అమెరికాలోని కొన్ని హోటల్స్ మోస్ట్ హంటెడ్ హోటల్స్ గా ఖ్యాతి గాంచాయి. అక్కడ ఓ హోటల్ లో వస్తువులు, దుస్తులు మాయం అయిపోతాయి. శబ్దాలకు చేస్తాయి. ఇదంతా భూతాలే చేస్తున్నాయా? అంటె అవును… ఇదే నిజం అంటారు స్టాన్లీ హోటల్‌కు వెళ్లే కస్టమర్లు, అక్కడ పనిచేసే సిబ్బంది. ముఖ్యంగా 217వ నెంబర్ రూం అంటే అందరికీ హడల్. అక్కడే ఉన్నాయట ఆత్మలు. రాత్రయితే అవి మేల్కొంటాయట. అవి చేసే శబ్దాలకు అక్కడున్నవారి వెన్నులో వణుకుపుడుతుంది….
ఇంత జరుగుతున్నా సరే టూరిస్టులు స్టాన్లీ హోటల్‌కు క్యూ కడుతుంటారు. ఇక పారానార్మల్ యాక్టివిస్టులకు ఈ హోటల్ అంటే చాలా మక్కువ. అందుకే రాత్రిపూట ఇక్కడే ఉండి భూతాలు, ఆత్మల కోసం వెదుకుతుంటారు. వీటి ఉనికిని తెలుసుకోడానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి పారానార్మల్ యాక్టివస్టులు ఇక్కడికి చేరుకుంటారు. చీకట్లో టార్చిలైట్లు, వివిధ పరికరాలు పట్టుకుని వేట సాగిస్తుంటారు. వింత శబ్దాలను రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక అక్కడ ఏవో శక్తులు ఉన్నాయనడానికి నిదర్శనంగా పారానార్మల్ యాక్టివిస్టులు తెచ్చే వస్తువుల్లో కదలిక స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కచ్చితంగా ఆత్మలు, భూతాల పనేనని నమ్ముతుంటారు వారు.
ప్రపంచంలోని మోస్ట్ హాంటెడట్ హోటల్స్‌లో ఒకటిగా మారిన స్టాన్లీ హోటల్ అమెరికాలోని కొలరాడోలో ఉంది. ఇక్కడ జరిగే వింత పనులు హారర్ నావెలిస్టులు, సినిమా వారిని ఆకర్షించాయి. వీటిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. నవలలు కూడా రాశారు. అందులో ముఖ్యమైన నావెలిస్ట్ స్టీఫెన్స్ కింగ్స్. అతడు భార్యతో కలిసి ఒకరోజు స్టాన్లీ హోటల్లో బసచేశాడు. విచిత్రమేంటంటే వాళ్లున్న గది నెంబర్ 217లోనే భూతాలు కంటిమీద నిద్రలేకుండా చేశాయట. దీన్నే కథావస్తువుగా తీసుకుని స్టీఫెన్ కింగ్స్ రాసిన నవల హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. అప్పుడే ఈ హాంటెడ్ హోటల్ విషయం చాలామందికి తెలిసింది.
ఫ్రీలన్ ఆస్కార్ స్టాన్లీకి, ఫ్లోరా స్టాన్లీ దంపతులు దీని నిర్మాణం 1907లో మొదలుపెట్టి 1909లో పూర్తి చేశారు. ఫ్రీలన్ ఆస్కార్ స్టాన్లీకి ట్యూబర్ కులోసిస్ అంటే టీబీ వచ్చింది. మంచి గాలీవెలుతురు వచ్చే ప్రాంతంలో ఉంటే వ్యాధి నయం అవుతుందని భావించాడు. అందుకే రాళ్లతో నిండిన పర్వతం వద్ద హోటల్ కోసం ప్లాన్ చేశారు. ఇక్కడి పర్వతాల అందాన్ని చూసి అతడు అతడి భార్య ఫ్లోరా స్టాన్లీ ముగ్దులయ్యారు. ఇక్కడే 47 ఎకరాల్లో ఓ లగ్జరీ హోటల్ నిర్మించారు. ఇంతలో అనూహ్యంగా అతడి వ్యాధి నయమైంది.
కాలక్రమంలో ఈ హోటల్‌కు ఆధునిక హంగులు అద్దారు. టీవీ స్క్రీన్లు, వైఫై వంటి అత్యాధునిక వసతులు కల్పించారు. 2016లో దీన్ని ఆధునికీకరించారు. ఇందులోనే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. హోటల్ ఎంత మోడర్న్‌గా ఉన్నా ఇక్కడి హారర్ సీన్లే టూరిస్టులను బాగా ఆకర్షిస్తున్నాయి.
Also Read: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! తొలిరోజు ఆట ఎంతసేపు జరుగుతుందో తెలుసుకోండి..